పచ్చిరోట్ట ఎరువులు :

పొలంలో పైరు లేనపుడు పచ్చిరోట్ట పైర్లు జనుము ,జీలుగ, పిల్లి పెసర పెంచుకొని 50 శాతము పుత దసలో వున్నపుడు భూమిలో కలియ దున్నాలి .


సేంద్రియ ఎరువులు :

4-6 వారాలకు ముందు ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువు లేదా 5 టన్నుల బాగా ఆరిన పొడి ఫిల్టర్ మడ్డి వేసి కలియ దున్నాలి .


జీవన ఎరువులు :

నత్రజని నందించే జీవన ఎరువులైన అజటోబాక్టర్ ( 2 కిలోలు ఎకరాకు ) లేదా అజోస్పైరిల్లం ( 4 కిలోలు ఎకరాకు ) 500 కిలోల పశువుల ఎరువులో కలిపి 2 దఫాలుగా నాటిన మూడవ రోజున సగభాగం నాటిన 45 వ రోజున మిగిలిన సగభాగాన్ని వేసుకోన్నట్లితే నత్రజని ఎరువుల్లో షుమారు 25 శాతం వరకు తగ్గించుకోవచ్చు. అలాగే ఎకరాకు 4 కిలోల ఫాస్ఫో బాక్టీరియా ముచ్చెలు నాటిన తరువాత ఆరవ రోజున జివ తడి ఇచ్చేముందు వేసుకుంటే భాస్వరపు ఎరువుల్లో షుమారు 25 శాతం వరకు ఆదా చేయవచ్చు.


రసాయనిక ఎరువులు :

a)శ్రీకాకుళం ,విజయనగరం ,విశాఖ,మెదక్ జిల్లాలో
b)ఉభయ గోదావరి , కృష్ణ ,గుంటూరు జిల్లాలో
c)కడప,కర్నూల్,అనంతపురం ,చిత్తూర్ జిల్లాలో
d)నిజామాబాద్ -ఎక్సాలి పంట
e)నిజామాబాద్ - అడసలి పంట
మొత్తం భాస్వరం , పొతష్ ఎరువుల్ని అన్ని ప్రాంతాల్లోనూ నాటే సమయంలోనే వేయాలి.

గమనిక

-రైతులు భుసార పరీక్షా ద్వారా రసాయనిక ఎరువుల మోతాదు వాడవలెను.


సూక్ష్మధాతు లోపాలు:

ఇనుప ధాతు లోప నివారణ:


సున్నం అధికంగా ఉండే తూర్పు , పశ్చిమ గోదావరి , చిత్తూరు, నిజామాబాద్ జిల్లాల్లో ఇనుప ధాతు లోప నివారణకు ఎకరాకు 2 కిలోల అన్నభేది 200 లీటర్ల నీటిలో కలిపి మొక్కల మిద పిచికారి చేయాలి .

మాంగనీసు ధాతు లోప నివారణ :

మాంగనీసు లోపం మెదక్ జిల్లాల్లో కొన్ని చోట్ల కనిపించింది . మాంగనీసు లోపం చెఱకు మద్య ఆకుల్లో, పాలిపోయిన పసుపు రంగుతో కూడిన ఆకుపచ్చ లేదా తెలుపు రంగు చారలుగా ఈ నెల ప్రక్కన కనబడ్తుంది . ఈ నెల మద్య తెల్లగా మారిన ఆకుభాగాల్లో కుళ్ళు మచ్చలు వచ్చి,అవి పెద్దవై , ఒక దానితో ఒకటి కలిసి పోయి,చారలు చారలుగా ఆకు నిలువునా చిల్చినట్లు కనబడతాయి. మాంగనీసు ధాతు లోప నివారణకు ఎకరాకు 2.5 కిలోల మాంగనీసు సల్ఫేట్ 450 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి.