అంతర పంటలు :

కలుపు నివారణ , అంతర కృషి:


ముచ్చెలు నాటిన వెంటనే లేదా 3 వ రోజున అట్రజిన్ 500 పొడి మందును ఎకరానికి 2 కిలోలు లేదా మేట్రిబుజిన్ 600 గ్రా 450 లీ. నీటిలో కలిపి పిచికారి చేసి ఒక నేల వరకు కలుపు నివారించుకోవచ్చు. తోట నాటిన నెల తర్వత 20,25 రోజుల వ్యవధిలో అవసరాన్ని బట్టి 2,3 సార్లు గొర్రు తో లేదా దంతితో అంతరక్రుషి చేయాలి లేదా కులిలతో కలుపు తెయించాలి. వెడల్పాటి కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్నపుడు 2-4 డి సోడియం సాల్ట్ 800 పొడి 1800 గ్రా.మరియు గ్రమోక్సన్ 240 ఒక లీటరు ఒక ఎకరాకు 450 లీ నీటిలో కలిపి వరుసల మధ్య మాత్రమే పైరు పడకుండా నాటిన 20,60 రోజులప్పుడుపిచికారి చేయాలి. ఈ మిశ్రమం స్ప్రే చేస్తున్నపుడు మందు పైరుపై పడితే పంటకు నష్టం జరుగుతుంది. తుఫాను గాలుల వలన తోటలు పడిపోయినప్పుడు చెఱకు దిగుబడి , రసనాణ్యత తగ్గుతాయి . తోట వయస్సు నాలుగు నేలలునప్పుడు (జూన్ -జూలై మాసాల్లో )మొక్కల వరుసల మొదళ్లకు ఎత్తుగా మట్టిని ఎగదోయాలి. పంట పెరుగుదలనుబట్టి 2-౩ సార్లు జడచుట్టె పద్ధతి ద్వార చెఱకు నునిలగట్టాలి.మొక్కతోటల్లో చెఱకు నాటిన మూడవ రోజున చెఱకు చెత్తను నేలపైపలుచగా(1.25 ట/ఎ)పరవాలి. వర్షకాలంలోకాలువలుఎగువేసే సమయంలోచెఱకు చెత్త [పై ఎకరానికి 1.25కిలోల కుళ్ళబెట్టే శిలి౦ధ్ర౦,8కిలోల యూరియా,10కిలోల సూపర్ఫాస్ఫేట్వేసిమట్టికప్పితే మంచి సేంద్రియ ఎరువుగా వినియోగపడుతుంది.