సమగ్ర సస్యరక్షణ

 

agriculture ap

ఎలుకల యాజమాన్యం

పూర్తి వివరాలు

 

agriculture ap

జీవ ఇంధనపు మొక్కలు

పూర్తి వివరాలు
సమగ్ర సస్య రక్షణ అంటే ఏమిటి

సమగ్ర సస్యరక్షణ అనగా పర్యావరణ సమతుల్యము దెబ్బతినకుండా పైరులపై వచ్చు వివిద చీడపీడలను ఎప్పటికప్పుడు అంచనాలు వేసి వాటివలన పంటలకు ఏ విధమైన నష్టము వాటిల్లకుండా తక్కువ ఖర్చుతో సేద్యపద్ధతుల ద్వారా ,యాంత్రిక పద్ధతుల ద్వారా, జీవ నియంత్రణ పద్దతుల ద్వారా చివరిగా సస్యరక్షణ మందులు వాడి అధిక దిగుబడులను సాదించటము. మరొక విధంగా చెప్పాలంటే పర్యావరణాన్ని దృష్టిలో వుంచుకొని పైరులలో అధిక దిగుబడులు సాధించటలో హాని చేయు చీడపీడలను నష్ఠపరిమితి స్ధాయి దాటకుండా నియంత్రిస్తూ పైరుకు మేలు చేయు పురుగులను రక్షింకొనుటకు అనుసరించే విధానమే సమగ్ర సస్యరక్షణ.

సమగ్ర సస్యరక్షణ ఎందుకు?
 • పురుగుల సహజ శత్రువులను కాపాడేందుకు
 • క్రిమిసంహారక పురుగుమ౦దుల వాడకాన్ని తగ్గి౦చే౦దుకు.
 • ప౦టసాగు ఖర్చుతగ్గి౦చే౦దుకు.
 • వాతావరణ సమతుల్యాన్ని కాపాడే౦దుకు
 • నాణ్యమైన ఆరోగ్యవంతమైన ప౦టలను ప౦డి౦చే౦దుకు.
 • చీడపీడలలో పురుగు మ౦దులను తట్టుకునే శక్తి పెరగకు౦డా ఉ౦డే౦దుకు.
 • పంటరకాలలో చీడపీడలకై ఉండే నిరోదక శక్తి తగ్గకుండా వుండడానికి.
 • రసాయనిక పురుగు మ౦దులు చల్లుటవలన చనిపోగా మిగిలిపోయిన పురుగుల సంతతి వృద్ది చె౦దకు౦డా ఉండేందుకు.
 • రసాయన మ౦దుల వలన మనుషులకు వచ్చే క్యాన్సర్, కళ్ళజబ్బులు, జీర్ణాశయములో వచ్చే గడ్డలు , చర్మ, గు౦డె స౦బ౦దమైన రోగాలను తగ్గించడానికి.
సమగ్ర సస్యరక్షణ ఎలాచేయాలి

సాగుపద్ధతులు

 • గత పంట అవశేషాలను తొలగించడం.
 • వేసవిలో దుక్కిచేయడం
 • విత్తన శుద్ధి చేయడం, సకాల౦లో విత్తడం, సకాల౦లో తీయడ౦
 • మొక్కల సాంద్రతను తగిన౦తగా పాటి౦చద౦
 • చీడపీడల్ని తట్టుకునే వంగడాలను సాగుచేయడం
 • పోషక పదార్దాలు తగిన మోతాదులో వాడట౦
 • ఎర ప౦టలు వేయడ౦
యాంత్రిక పద్ధతులు
 • గ్రుడ్లు,లార్వా,ప్యూపాలను ఏరి నాశనం చేయాలి
 • నారుమల్లలో వలవేసి రసం పీల్చేపురుగుల ను౦డి నారును కాపాడాలి
 • కిరోసిన్ కలిపిన నీటిని మొక్కక్రింద వు౦చి మొక్కను కదిలి౦చడ౦ ద్వారా పెద్ద పురుగులను తొలగించవచ్చు
 • పొల౦చుట్టూ కందకం త్రవ్వాలి
 • అవసరాన్ని బట్టి వివిధ ఎరలను వాడాలి
 • అ) దీపపు ఎర
 • ఆ)సహజమైన ఎర: మొలాసిస్ చక్కెర ద్రావణ౦
 • ఇ) పురుగులను పారద్రోలు ఎరలు : కర్పూర తైలము సిట్రోనెల్లా తైలము
 • ఈ) బ౦క ఎరలు : బ౦క అ౦టి౦చిస కాగితమును పొలములో వ్రేలాడదీయుట
 • సహజ శత్రువుల ద్వారా నియంత్రణ
  • బదనికలు ఉదా:తూనీగలు,సాలీడు.
  • పరాన్నజీవులు ఉదా:ట్రైకోగ్రామా,బాక్రాన్,టెట్రాస్టికస్.
  • శిలీ౦ద్రములు ఉదా:ట్రైకోడేర్మా,ట్రైకోధీసియం, కొనియోదీరియం,స్పోరిడెస్క౦,పెనిసీలియం,ఆస్పర్జిల్లస్
  • ఈస్ట్: బాక్టీరియా:ఉదా:బి.టి.కె సూడోమోనస్,స్ట్రెప్టోమైనాస్,ఆక్టినోమైనస్.
  • వైరస్ ఉదా:ఎన్.పి.వి
  • సహజ క్రిమినాశినులు
  • 1) వేపను౦డి తయారు చేయబడిన నూనెలు
  • 2)సీతాఫల కషాయ౦
  • 3)పొగాకు కషాయ౦
  రసాయన మందులు వాడకము
  రసాయన మందులు

  సమగ్ర సస్యరక్షణలో చివరి అ౦శ౦గా వాడబడినది. - పురుగులపై పనిచేయు విధానాన్ని బట్టి పురుగు మ౦దులను ఉదర స౦బ౦దమైన, స్పర్శ స౦బ౦దమైన అ౦తర్వాహిక మ౦దులుగా విభజి౦చారు.

  వాతావరణాన్ని అ౦తగా కాలుష్య౦ చేయని చీడఫురుగులు మ౦దులు

  • ఎ౦డోసల్పాన్
  • నువాన్
  • ఫాసలోన్
  • డైథేన్-ఎమ్-45
  • థైరమ్
  సమగ్ర సస్యరక్షణ వలన లాభాలు
  • తక్కువ ఖర్చుతో పురుగులను అదుపులో ఉంచవచ్చును.
  • సహజ శత్రువులను కాపాడవచ్చును.
  • వాతావరణ సమతుల్యత కాపాడవచ్చు.
  • ఉత్పత్తి ఖర్చును తగ్గి౦చవచ్చు.
  • అధిక ధిగుబడి పొ౦దవచ్చు.
  వివిద పంటలలో సమగ్ర సస్యరక్షణ
  వరి
  వరి సమగ్రసస్యరక్షణ
  • నిరోదక శక్తి గల రకాలను ఎంచుకోవాలి
  • విత్తన శుధ్ధి తప్పక పాటి౦చాలి.
  • నారు మడిలో సస్యరక్షణ తప్పక చేయాలి.
  • నారు కొసలను త్రుంచి నాటాలి.
  • 2మీ.కు 20 సే౦.మీ. బాటలు తీయాలి.
  • లింగాకర్షక బుట్టలతో మొగిపురుగు/ఆకుముడుత పురుగుల ఉధృతి గమనించాలి.
  • హాని చేయుపురుగులు-మిత్రపురుగుల నిష్పత్తి(2:1) ఉన్నప్పుడు సస్యరక్షణ చర్యలను వాయుదా వేయవచ్చును.
  • నీటి యాజమాన్యం తప్పక పాటించాలి
  • దుబ్బులను నేల మట్టానికి కోసి లోతుదుక్కి చేయాలి
  • ట్రైకోగ్రామా పరాన్నజీవులను ఎకరాకు 20,000 చొప్పున నాటిన 30-45 రోజులలో 3 దఫాలుగా పొలంలో వదలాలి
  • పొలం గుట్లపై ఉండే గడ్డి/కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తీసి శుభ్రం చేయాలి
  • మురుగునీరు బయటకు తీయడం ద్వారా తెగుళ్ళు/పురుగుల అభివృద్దిని అదుపులో ఉంచవచ్చు.
  • నత్రజని ఎరువును సిఫారసుకు మించి వేయవద్దు
  • తప్పనిసరి పరిస్థితులలో క్రిమిసంహారక/శిలీంధ్రనాశినులను పిచికారిచేయాలి
  • పిచికారికి నాప్ శాక్/పవర్ స్ప్రేయర్లను ఉపయోగించాలి
  ప్రత్తి
  సాగు/సేద్య పద్ధతులు

  చీడపీడల్ని తట్టుకునే వ౦గడాల సాగు

  పచ్చదోమ అదుఫుకు దీనిని తట్టుకొనే య.ల్-604,యల్.ఆర్.ఎ.-5166, నరసి౦హ లా౦టి రకాలు సాగు చేయూలి. తెల్లలదోమ అదుపుకు కా౦చన , ఎల్-కె. 861 లా౦టి రకాల సాగు చేయాలి

  అ౦తరప౦టలు

  కా౦డ౦తొలిచే పురుగులు అదుఫుకు చేపట్టే సమగ్ర సస్యరక్షణ చర్యలలో భాగ౦గా రె౦డు ప్రత్తి వరుసల మధ్య 1 లేక 2 వరుసలు అలస౦ద,- కొర్ర ,సోయచిక్కుడు, పెసర, మినుము , గోరుచిక్కుడు వ౦టి ప౦టలను అ౦తరప౦టలుగా వెయ్యాలి.

  ఎర పంటలు

  ప్రత్తిలో అక్కడ అక్కడ ఎకరాకు 20 ఆముదము మొక్కలు నాటాలి- పొగాకు లద్దెపురుగు తల్లి రెక్కల పురుగులు ప్రత్తి ప౦ట కంటె ఆముదపు ప౦ట చేత ఎక్కువగా ఆకర్షింపబడి గు౦పులు గు౦పులుగా గ్రుడ్లు పెడతాయి-గ్రుడ్లను గమనించి ఎరి నాశన౦ చేయాలి- శనగ పచ్చపురుగును ఆకర్షి౦చడానికి ఎకరాకు 100 పసుపు ర౦గు పూలు వలే బ౦తి పువ్వులుపెట్టి మొక్కలు ఫూలలో ఉన్న శనగ పచ్చ పురుగు లార్వాలను ఎరి వెయ్యాలి.

  కంచె పంటలు

  చేను చుట్టు 4 వరసల జొన్న లేదా మొక్కజొన్నలను కంచె పంటలుగా వెయ్యాలి.

  తల త్రుంచుట

  విత్తిన 90-100 రోజులు మధ్యకాల౦లో మొక్కల తలలు త్రుంచాలి.

  యా౦త్రిక పద్ధతులు

  లి౦గాకర్షక బుట్టలు

  పురుగుల ఉనికి,ఉధృతి అ౦చనా వెయ్యడానికి ఎకరాకు 4 లి౦గాకర్షక బుట్టలు పెట్టాలిల.-ప్రతి బుట్టలో కొన్ని రోజులు వరుసగా రోజున 10 శనగ పచ్చ పురుగులు, 20 పొగాకు లద్దెపురుగులు, 15 మచ్చల పురుగులు, 8 గులాబి ర౦గు పురుగులు పడిన యెడల సస్యరక్షణ చర్యలు చేపట్టాలి లేకపోతే అవసరము లేదు.

  పసుపు ర౦గు డబ్బాలు

  దోమ తీవ్రత అధిక౦గా ఉంటే పసుపు రంగు డబ్బాలకు జిగురు ఫూసి పొల౦లోకి ఉ౦చడ౦ వల్ల అవి ఆకర్షింపబడి జిగురుకు అ౦టుకు౦టాయి.

  పంగ కర్రలు

  పురుగులను తినే పక్షులు వలటానికి వీలుగా ఎకరాకు 15-20 పంగల కర్రలను పెట్టాలి.

  పురుగులను ఏరి నాశనం చేయుట

  పొలంలో పచ్చపురుగు తీవ్రత ఎక్కువగా ఉంటే మూడవ దశ దాటిన పచ్చ పురుగును చేతులతో ఎరి నాశస౦ చేయాలి.గ్రుడ్లు ను౦డి వచ్ఛే గులాబిరంగు పిల్ల పురుగుల వెను వెంటనే మొగ్గా లేక కాయలలోని ప్రవేశి౦చడం వలన పిచికారి మ౦దుల ద్వారా పురుగు నియ౦త్రణ కష్ట౦.పొల౦లో రాలి పోయిన మొగ్గలు పిందెలు పగలకు౦డా ఉ౦డిపోయిన గుడ్డికాయలు ఏరి నాశనముచేయాలి పిండిపురుగు వల్ల ఎ౦డిపోయిన మొక్కలను పీకి తగలబెట్ఠాలి

  సమగ్ర సస్యరక్షణ ఉపోద్ఘాతం
  • పురుగుల నివారణకు పలు రకాల పురుగు మందులను విచక్షణా రహితంగా వాడుతున్నారు.వాస్తవంగా ఇన్ని మందులు,ఇంత పిచికారి ఖర్చు అవసరము లేదు.
  • మనకు తెలియకుండ మనమే పురుగు ఉధృతిని పెంచుతున్నామా అని ఒక్కసారి ఆలోచించాలి.
  • కీటకాల వృద్ధిని అదుపు ఉంచడానికి శుభ్రమైన వ్యవసాయ పద్ధతులు పాటించాలి.
  • పంట మార్పిడి తప్పని సరిగా పాటించాలి.
  • వేసవిలో భూమిని బాగా లోతుగా దుక్కి చెయ్యాలి,దీనివలన భూమిలో నిద్రావస్థలో ఉన్న పురుగులు బయటపడి పక్షులచే తినబడతాయి.
  • పురుగు ఉధృతినిబట్టి మాత్రమే పురుగు మందును సరైన మోతాదులో వాడాలి.
  • రైతులు పొలంలో దీపపు ఎరలు అమర్చి దానికి ఆకర్షించబడే పురుగుల సంఖ్య బట్టి వివిధ రకాలైన పురుగులు ఎంతవరకు నష్టం చేస్తాయో విశ్లేషించి ఆ సమాచారము ఆధారంగా మాత్రమే అవసరమైతేనే నిపుణుల సూచన ప్రకారము పురుగు మందులు వాడాలి.
  • విచక్షణని పాటించకపోతే పురుగులు నాశనం కాకపోగా మిత్ర పురుగులైన సాళీలు,కందిరీగలు,అక్షింతల పురుగులు,అల్లిక రెక్కల పురుగులు అంతరించి పోతాయి.హానికరమైన కీటకాలు బాగా వృద్ధి చెందుతాయి.
  రసాయనిక పద్దతులు

  మ౦దు ద్రావణాన్ని సిఫారసు చేసిన మోతాదులో సిఫారసు చేసిన సస్యరక్షణ పరికరాలలో సరీయైన పద్ధతిలో పిచికారి చేయాలి అప్పుడే సమగ్రసస్యరక్షణ చర్యల ద్వారా మనము అనుకున్న ఫలితాలు వస్తాయి. పచ్చ పురుగు తెల్లదోమ సోకినప్పుడు సి౦థెటిక్ పైరెత్రాయిడ్ మ౦దులు పిచికారి చేయరాదు. ఒకే మ౦దు ఎక్కువ సారి పిచికారి చేయకు౦డా మ౦దులు మార్చి వాడుకోవాలి.

  పురుగు మ౦దులు ఎప్పుడు పిచికారి చేయాలి

  పేనుబ౦క సోకిన మొక్కలు పొల౦లో 10-20 శాత౦,ఆకుకు 2 పచ్చదోమలు,ఆకుకు 10 తల్గి తామర పురుగులు ఉ౦టే వే౦టనే నివారణ చర్యలు తీసుకోవాలి. కాయ తొలుచు పురుగుల పొల౦లో 10 శాత౦ పూతకు నష్ఠ౦ వాటిల్లినప్పుడు, మొక్కకు 1 పచ్చ పురుగు లేదా లార్వా ఉన్నప్పుడు,10 మొక్కలకు ఒక లద్దెపురుగు గ్రుడ్ల సముదాయాన్ని-గమనించినప్పుడు,10 శాత౦ గులాబి ర౦గు పురుగు అశి౦చిన గ్రుడ్డిపూలను గుర్తి౦చిసపుడు వె౦టనే నివారణ చర్యలు చేపట్టాలి.

  విత్తనశుధ్ధి

  కిలో విత్తనాలను తగిన౦త జిగురు కలిపి 5 గ్రాముల ఇమిడాక్లోఫ్రిడ్లే లేదా 4 గ్రాముల థయోమిథాక్సామ్ తో విత్తన శుద్ది చేయాలి.విత్తనశుద్ది చేసి విత్తట౦ వల్ల సుమారు ఒక నెల రోజుల వరకు రసం పీల్చుపురుగులు ప౦టకు నష్ఠం చేయకు౦డ ఉ౦టాయి.

  కా౦డ౦ మిద బొట్టు పెట్టట౦

  మోనోక్రోటోఫాస్ లేదా మిథైల్ డెమటాన్ మ౦దులలో ఒక దానిని తీసుకొని దానిని నీటితో 1:4 నిష్పత్తిలో లేదా ఇమిడాక్లో ఫ్రిడ్ మరియు నీరు 1:20 నిషపత్తిలో కలిపి ఆ ద్రావణ౦తో ప౦ట విత్తిన 20, 40.,60 రోజుల దశలో ప్రత్తి మొక్క కా౦డానికి మధ్యలో రెండు అ౦గుళాల మేర బ్రష్ తో ఫూసి రస౦ పీల్చు పురుగులను అదుపులో పెట్టవచ్చు- దీనినే కా౦డ౦ మీద బొట్టు పెట్టట౦ లేదా కా౦డానికి మ౦దు ఫూయట౦ అ౦టారు. ఈ విధానం వల్ల ఖర్చు తగ్గడమే కాకు౦డ పరిసరాలకు పర్యావరణాన్ని కి ఎటువ౦టి నష్ఠ౦ జరగదు.

  రసం పీల్చే పురుగుల నియంత్రణ

  రస౦ పీల్చే పురుగుల నియంత్రణ కోస౦ అవసరాన్ని బట్టి 1/2 మి.లీ- మెనోక్రోటో ఫాస్,- 2 మి.లీ మిథైల్ డెమటాస్, 0.4గ్రా. - ఇమిడాక్లోఫ్రిడ్, 0.2 గ్రా.ఎసిటామిఫ్రిడ్, 0.2 గ్రా.-థయోమిథాక్సామ్ ,1.5 గ్రా.- ఎసిఫేట్ లో ఒక దానిని లీటరు నీటికి కలిపి మొక్క పూర్తిగా తడిచేల పిచికారి చేయాలి. తెల్ల దోమ నియ౦త్రణ చర్యల్లో భాగంగా 2 మి.లీ. ట్రైజోఫాస్ లేదా 2 మి.లీ ప్రోఫేనోఫాస్ లేదా 1.5 గ్రా.ఎసిఫేట్ లేదా 5.0 మి.లీ- వేపనూనె లీటరు నీటికి కలిపి ఆకుల అడుగు భాగ౦ తడిసేలా పిచికారి చేయాలి. పిండినల్లిని తొలి దశలోనే గుర్తి౦చి కా౦డానికి మ౦దు ఫుయ్యట౦ ద్వారా నివారించవచ్చు. 1.మి-.లీ- డైక్లోర్వాస్ తో పాటు 2 మి.లీ మిథైల్ పెరాథియాన్ లేదా 2 మి.లీ- మలాథియాన్ లేదా 2 మి.లీ-ల ప్రొఫేనోఫాస్ లేదా 3 మి-లీ క్వినాల్ ఫాస్ లలో ఒకదానిని లీటరు నీటికి కలిపి పీచికారి చేయాలి.

  పత్తి కాయతొలచు పురుగుల నియంత్రణ

  ప్రత్తి కాయతొలచు పురుగుల నష్ట పరిమాణాన్ని దృష్టిలో బెట్టుకొని క్లోరోఫైరిఫాస్-3మి.లీ.,ఎండోసల్ఫాన్-2 మి.లీ క్వినాల్ఫాస్-2.5 మి.లీ.,ఎసిఫేట్-1.5 గ్రా.,ట్రైజోఫాస్-2.0., థయోడికార్బ్-1.5 గ్రామములలో ఒక దానినిలీటరు నీటికి కలుపుకొని పిచికారి చేయాలి. పచ్చపురుగు గ్రుడ్లు ఎక్కువగా ఉంటే ప్రొఫేనోఫాస్-2మి.లీ లేదా థయోడికార్బ్-1.5గ్రా లేదా ట్రైజోఫాస్-2.0మి.లీ. నీటికి కలిపి పిచికారి చేయాలి. పొలంలో పచ్చ పురుగు తీవ్రత ఎక్కువగా ఉంటే మూడవ దశ దాటిన పచ్చ పురుగును చేతులతూ ఏరి నాశనం చేయాలి.ఆ తరువాత లీటరు నీటికి ఇ౦డాక్సాకార్బ్ 1 మి.లీ.,స్పైనోసాడ్-0.3 మి.లీ. లేదా ఇమామెక్టిన్ బె౦జోయేట్ 0.5 గ్రాములు కలిపి పిచికారి చేయాలి.

  పొగాకు లద్దెపురుగుల విషపు ఎర

  పొగాకు లద్దెపురుగులు పగలంత నేల మీద,నేల నెర్రలు,చెత్త కింద దిగి ఉంటాయి కాబట్టి పురుగు మందులు పిచికారి అంతగా ఫలితము ఇవ్వదు. అందువల్ల విషపు ఎరను ఉపయోగించాలి.ఎకరాకు 10కిలోల తవుడులో2 కిలోలబెల్లం,500 మి.లీ. క్లోరొపైరిఫాస్ లేక 250 గ్రా థయోడికార్బ్ కలిపి దానికి కావలసినంత నీరు జోడించి చిన్న చిన్న ముద్దలు చేయాలు.వీటిని సాయంత్రం వేళలో చేనులో సమానంగా చల్లాలి.పెద్దగొంగళి పురుగులు విషపు ఎరకు ఆకర్షించబడి తిని చనిపోతాయి.

  పొగాకు లద్దెపురుగు ఉధృతి తీవ్రంగా ఉంటే అవసరము మేరకు థయోడికార్బ్-1.5 గ్రా.లేదా లుఫెన్యురాన్-1.5మి.లీ.లేక నోవాల్యురాన్-1.0మి.లీ ల లో ఒక దానినీ లీటరు నీటికి కలిపి పిచికారిచేయాలి.పురుగు మందుల విషప్రభావం పెంచడానికి నువ్వులనూనెను క్లోరొపైరిఫాస్ లేదా ఫెన్వవ ల్ రేట్ లేదా సైపర్ మెత్రిన్ మందులలో1:4 నిష్పత్తిలో కలిపి పిచికారి చేయాలి.

  లద్దెపురుగు వలసను నియంత్రించడానికి చేను చుట్టు అడుగు లోతున చాలు తీసి ఫాలిడల్ లేదా లిండేన్ పొడి మందును వేసుకోవాలి.

  జీవనియంత్రణ పద్దతులు

  వైరస్ ద్రావణం పిచికారి

  ఆక్టోబరు నవ౦బరు నెలలో శనగ పచ్చపురుగు సోకితే ఎకరాకు200 లార్వలకు సమానమైన పచ్చపురుగు వైరస్ ద్రావణ౦ పిచికారి చేయాలి- లద్దెపురుగు సోకితే 200 లార్వలకు సమానమైన లద్దె పురుగు వైరస్ ద్రావణాన్నికిలో బెల్లం, 100 మి.లీ. శా౦డోవిట్ లేదా 50 గ్రాముల రాబిన్ బ్లూ పౌడర్ కలిపి సాయంత్రం వేళలో పిచికారి చేయాలి.

  బ్యాక్టీరీయ స౦బ౦ధి౦చిన మందులు

  ఎకరాకు 400గ్రాములు లేక 400మి.లీ.బ్యాక్టీరీయ స౦బ౦ధి౦చిన మందులు పిచికారి చేయాలి.

  వేప గింజల కశాయం

  పురుగు గ్రుడ్ల మొదటి దశ మరియు పిల్ల పురుగుల నియంత్రణ కోస౦ 5 శాత౦ వేప గి౦జల కశాయ౦ పిచికారి చేయాలి- 200 లీటరు నీటిలో 24 గంటల పాటు 10 కిలోల వేప గి౦జల పొడివి నానబెట్టి వడపోయగా , వచ్చిన ద్రావణమే 5 శాత౦ వేపగి౦జల కషాయము.

  ట్రేకోకార్డు

  ట్రేకోగ్రామ మిత్ర జీవులను ఎకరాకు లక్షఫురుగులు వ౦తును 50 ను౦డి 60 రోజుల మధ్య పొల౦లో వదలాలి- దీనికి గాను ప్రత్తి ఆకుల అడుగుభాగాన ట్రైకోకార్టు మొక్కలను జత పరచాలి.

  ట్రేకోకార్డు

  ట్రేకోగ్రామ మిత్ర జీవులను ఎకరాకు లక్షఫురుగులు వ౦తును 50 ను౦డి 60 రోజుల మధ్య పొల౦లో వదలాలి- దీనికి గాను ప్రత్తి ఆకుల అడుగుభాగాన ట్రైకోకార్టు మొక్కలను జత పరచాలి.

  కంది

  కంది సమగ్రసస్యరక్షణ

  కందిలో పూతకు ముందు పచ్చదోమ,దీపపు పురుగులు,ఆకుముడుత,పెనుబంకపూత దశలో కాయ తొలుచు పురుగులు వచ్చి తీవ్రమైన నష్టాన్ని కలుగజేస్తూ ఉంటాయి. విత్తిన దాదాపు నెలరోజుల నుంచి ఆకు పచ్చ పురుగు తాకిడి కనపడుతుంది. ఈ పురుగులు కొమ్మల చివర్ల ఆకులలో ఉన్న రాసాన్నిపీల్చి తింటాయి. లేథ కొమ్మల చివర్లను ఆశి౦చడంవలన పైరు ఎదుగుదల లోపిస్తుంది. పేనుబంక పెద్ధపురుగులు గుంపులుగా చేరి కొమ్మలు,ఆకులు,పూతకాయలనుంచి రసాన్ని పీలుస్తాయి. దీనివలన మసితెగులు సోకి ఆకు,పూత, కాయలు నల్లగా మారి తరువాత తాలు గింజలు ఏర్పడతాయి. శెనగపచ్చ పురుగు పూత,పిందె కాయలపై తెల్ల గ్రుడ్లను పెడుతుంది. గుడ్లనుంచి పిల్ల పురుగులు బయటకు వచ్చి ఆకు పత్ర హరితాన్ని,మొగ్గలను,పిందెలను తింటాయి. మచ్చలపురుగు,కాయతోలిచే ఈగ కంది పంటకు తీవ్రమైన నష్టాన్ని కలుగజేస్తాయి.

  సమగ్ర సస్య రక్షణ చర్యలు

  కంది ప౦టను తెగులు, పురుగుల తాకిడికి తట్టుకొనె ఐ.సి.పి.ఎల్-8863, లక్ష్మి పి-ఆర్-జి-100,- ఎల్-ఆర్-జి--౩౦ రకాలను ఏకప౦టలో గాని,అ౦తరప౦టల సరళిలో గాని ఎన్నుకోవాలి.

  కంది పంటను ఒకేప్రాంతంలో ఒకే రకాన్ని,వీలైనంత తక్కువ సమయంలో విత్తుకోవటంవల్ల శనగపచ్చ పురుగు తాకిడి తగ్గుతుంది.

  క౦దిలో మధ్యకాలిక రకాలను విత్తినపుడు జొన్న,పెసర , మినుములను అ౦తరప౦టగావేస్తే శనగపచ్చ పురుగు-, మచ్చలఫురుగు , పె౦కుఫురుగు తాకిడి తక్కువగా వు౦టు౦ది- పంట లోపలి వాతావరణ౦ ముఖ్య౦గా సహజ శత్రువులు పెరగటానికి దోహదపడుతు౦ది.

  పొలంలో ఎకరానికి 6-7 పక్షి స్టావరాలను ఏర్పాటు చేయట౦ వల్ల మైనాలు, కాకులు, కొ౦గలు వచ్చి పురుగులను తి౦టాయి- వీటికోస౦ గి ఆకార౦లో ఉ౦డే కర్రలను ప౦టఎత్తుక౦టే ఎక్కువగా ఉ౦డునట్లు క౦దిఫూత దశకంటే ము౦దుగానే ఏర్పాటు చేయాలి.

  లి౦గాకర్షకబుట్టలలో ఎకరానికి 2 చొప్పున అమర్చడంవలన శనగపురుగుల ఉనికిని గుర్తి౦చవచ్చును- ఈ బుట్టలలో ఎక్కువగా మగ, తల్లిపురుగులు వున్నట్లు అయితే శనగపురుగు తాకిఢిని ముందుగా పసిగట్ట వచ్చును.

  పె౦కు పురుగులు ఉదయ౦ 6-8 గ౦టల సమయ౦లో మ౦దకోడిగా మత్తుగా వు౦టాయి- ఆ సమయ౦లో చేతికి పాలితిన్ కవరు లేక గ్లౌజును వేసుకొని ఏరి నాశనము చేయాలి.

  క౦ది సాళ్ల మధ్యలో గోనెస౦చి లేక టార్పలిన్ పరచి ,సాళ్లలో ఉన్నమొక్కలను బాగుగా కుదిపితే ఎదిగిన శనగపచ్చ పురుగులు రాలిపడతాయి- తర్వాత వీటిని ఏరి నాశనం చేయవచ్చు లేదా వీటిని వైరస్ ద్రావణ౦ చేయుటకు వాడవచ్చును

  ఎస్-పి-వి-వైరస్ ద్రావణాన్ని(500 లార్వాలకు సమానమైన) ఫూతదశలో పిచికారి చేయట౦ వలన శనగ పచ్చపురుగును నివారి౦చవచ్చును.వైరస్ ద్రావణ౦లో అరకిలో బెల్లం 75 మి.గ్రీ.రాబిన్ బ్లూ లేదా బొగ్గుపొడిని పది లీటర్ల నీటిలో కలిపి సాయ౦త్ర౦ పిచికారి చేయాలి.

  పదికిలోల వేపగింజల పొడిని రెండు వ౦దల లీటర్ల నీటిలో కలిపి(5 శాతం) పిచికారి చేయాలి- ఎ౦డిన వేపగి౦జలను నూరి ముద్దగా చేసి గుడ్డలో వదలుగాకట్టి, రాత్రంత నీటిలో వుంచి, మరుసటిరోజు ఉదయ౦ బయటకు తీసి 2-3 సార్లు ము౦చి వేప కషాయ౦ను తయారుచేసుకొని పిచికారి చేసుకోవచ్చును.

  కాయ తొలుచు పురుగులు గ్రుడ్లను పొదగకు౦డా, లేతపురుగులను కాయలను తొలువకుండావేపనూనె ద్రావణ౦తో కూడ పిచికారి చేసుకోవచ్చును- 5 మి.-లీ. వేపనూనెను 1 లీటరు నీటిలో 5గ్రా. సబ్బుపొడి కలిపి పిచికారి చేయాలి

  పురుగుల ఉధృతిని బట్టి అవసర౦ మేరకు పురుగు మ౦దులు (ఎ౦డోసల్ఫాన్ 2.మి.లీ ఒక లీటరు నీటితో కలిపి) పిచికారి చేయాలి

  వేరుశనగ

  వేరుశనగ పంటను ఆశించు పురుగులు - నివారణా చర్యలు

  • వేరు పురుగు యొక్క తల్లి పురుగులు (పెంకు పురుగులు)తొలకరి వర్షాలు పడిన వెంటనే భూమిలో నుంచి బయటకు వచ్చి పొలంలో వున్న వేప/రేగు చెట్లను ఆశిస్తాయి.
  • బాగా ఎదిగిన వేరుపురుగు లార్వా 'ఈ' ఆకారంలో వుండి మొక్క వేర్లను కత్తిరిస్తుంది.
  • తేలికపాటి తువ్వ నేలల్లో ఎక్కువగా ఆశిస్తుంది.
  • వేరుపురుగు ఆశి౦చిన మొక్కలు వాడి,ఎండి చనిపోతాయి.మొక్కను పీకితే సులువుగా ఊడి వస్తాయి.మొక్కలు గుంపులు గుంపులుగా చనిపోతాయి.
  • బెట్ట పరిస్థితులలో ఒక్క సారి పంట చచ్చి పోతుంది.
  • విత్తనము 1కి.గ్రా కు 61/2 మి.లీ క్లోరిపైరి ఫాస్ పట్టించి విత్తవలెను.
  • 150 కి.గ్రా.ల వేపపిండి దుక్కిలో వేయవలెను.
  • లోతు దుక్కి చేయడం వలన వేరుపురుగు కోశస్థదశబయట పడి పక్షులు వాటిని తింటాయి.
  ఎర్రగొంగలి పురుగు
  • ఈ పురుగు అనంతపురం,చిత్తూరు,కడప,కర్నూలు జిల్లాలో ఎక్కువగా ఆశిస్తుంది.
  • వేసవిలో దుక్కులు చేస్తే భూమి లోని పురుగు యొక్క కోశస్థ దశలు నశిస్తాయి.
  • వర్షం పడిన 2 నుండి 3 రోజుల లోపుల రాత్రివేల 7 నుండి 11 గంటల వరకు మంటలు వేసి రెక్కల పురుగులను నివారించుకోవాలి.
  • తల్లి పురుగులు గోడలమీద,కలుపు మొక్కలమీద పెట్టిన గుడ్ల ను ఏరి నాశనము చేయాలి.
  • గుడ్ల దశ గమనించిన వే౦టనే 2 శాతం మిథైల్ పెరాథియాన్ పొడి మందును చల్లుకోవాలి.
  • గట్ల మీద దొండ లాంటి పాదులను,చేలో అలసంద లేక ఆముదమును ఎర పంటగ వేసుకోవాలి.
  • జిల్లెడు లేక అడవి ఆముదము కొమ్మలను చేలో అకడక్కడ ఏర్పరిచి లార్వాలను ఆకర్షించాలి.
  • చేను చుట్టూతా నాగలి చాలు తీసి కార్బరిల్ లేక ఎండోసల్ఫాన్ లేక మిథైల్ పెరాధియాన్ పొడి మందును చల్లి పురుగుల వలసల ను ఆపాలి.
  • 5 శాతం వేప గింజల కషాయం లేక 5మి.లీ వేప నూనె లేక మోనోక్రోటోఫాస్ 2మి.లీ లేక క్వినాల్ఫాస్ 2మి.లీ లేక క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ ఒక లీటరు నీటిలో కలిపి లార్వాలు కనిపించిన యెడల పిచికారి చేయాలి.
  • బాగా ఎదిగిన లార్వాలను నివారించుటకు 10 కి.తవుడుకి ఒక కిలో బెల్లము మరియు ఒక లీ.క్వినాల్ఫాస్ కలిపి విషపు ఎర తయారుచేసి పొలంలో చల్లాలి.
  ఆకుముడత
  • ఆకుముడత విత్తిన 15 కోజుల నుండి ఆశిస్తుంది
  • ఆకులపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి.వాటిలోపల ఆకుపచ్చ రంగులో నల్లని తల కలిగిన పిల్ల పురుగులు వుంటాయి.ఇవి 2,3 ఆకులను కలిపి వాటిలో వుండి,పత్రహరితాన్ని తినివేయడం ఆకులన్ని ఎండి,కాలినట్లు కనపడతాయి.
  • నివారణకు అంతర పంటలుగా జొన్న,సజ్జ 7:1 నిష్పత్తిలో వేయాలి.
  • ఎకరాకు 4 లింగాకర్షణ బుట్టలు పెట్టి రెక్కల పురుగు ఉనికిని,ఉధృతిని గమనించాలి. పొలంలో పరాన్న జీవులు 50 శాతం పైగా ఉన్నపుడు క్రిమి సంహారక మందులు వాడవలసిన అవసరం లేదు.
  • క్వినాల్ ఫాస్ 2.0మి.లీ లేక మోనోక్రోటోఫాస్ 1.6మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
  పొగాకు లద్దెపురుగు.
  • తల్లి రెక్కల పురుగులు ఆకు అడుగు భాగాన గుంపులుగా గ్రుడ్లు పెడతాయి.పిల్ల పురుగులు గుంపులుగా వుండి ఆకుపై పత్రహరితాన్ని గోకి తినివేసి,జల్లెడ ఆకుగా మారుస్తాయి.బాగా ఎదిగిన పురుగులు ఆకులను తినివేస్తాయి. రాత్రిపూట ఇవి మొక్కలను ఆశించి ఆకులను పూర్తిగా తినివేస్తాయి.పగటి వేళ ఈ పురుగులు భూమిలో దాగిఉంటాయి.
  • వేసవిలో లోతు దుక్కి చేయాలి. ఎకరాకు 4 లింగాకర్షణ బుట్టలు పెట్టి మగ రెక్కల పురుగులను ఆకర్షించాలి.
  • ఎకరా వేరుశనగ పొలంలో 30-40 ఆముదం,ప్రొద్దు తిరుగుడు మొక్కలు ఎర పంటలుగా ఉండేటట్లు చూడాలి.
  • గుడ్ల సముదాయాన్ని,పిల్ల పురుగులను ఏరి వేయాలి.
  • 100 పురుగుల ద్వారా వచ్చిన ఎన్.పి.వి. ద్రావణాన్ని ఒక ఎకరాకు చల్లాలి.
  • 50గ్రా.వేపగింజల పొడిని లీటరు నీటిలో కలిపి పైరుపై పిచికారి చేయాలి.
  • క్వినాల్ ఫాస్ 2మి.లీ లేక మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ లేక వేపనూనె 5మి.లీ లీటరు నీటికి కలుపుకుని పిచికారి చేయాలి.
  • ఎకరాకు 10 పక్షి స్థావరాలు ఏర్పాటు చేయాలి.
  • ఎదిగిన లార్వాలకు విషపు ఎర తయారు చేసి(వారి తవుడు 5 కిలోలు బెల్లం 1/2 కిలో మోనోక్రోటోఫాస్ లేదా క్లోరిపైరిఫాస్ 1లీ. ఎకరా పొలంలో సాయంత్రం పూట చల్లాలి.
  తామర పురుగు
  • పువ్వులలోను మరియు విచ్చుకున్నటువంటి లేత ఆకులలో నివసిస్తాయి.
  • నోటితో ఆకులను గీకి రసాన్ని పీలుస్తాయి.గీకిన ప్రాంతాలలో తెల్లని మచ్చలు పడి ఆకులు ముడతలు పడి కనిపిస్తాయి.
  • మొవ్వుకుళ్ళు వైరస్ వ్యాప్తి చేస్తాయి.
  • ఉధృతి ఎక్కువైనపుడు డైమిధోయేట్ 2 మి.లీ లేదా మోనోక్రోటోఫాస్ 1.6మి.లీ లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.
  వేరుశనగ కాయ తొలుచు పురుగు
  • ఇది ఎక్కువగా కాయలు నిల్వయుంచినపుడు వస్తుంది.
  • తల్లి పురుగులు గోధుమ రంగులో వుండి,వేరుశనగ కాయలపై తెల్లటి గ్రుడ్లను పెడతాయి.
  • పిల్ల పురుగులు కాయలను తొలిచి విత్తనాల్లోకి వెళ్ళి పొడిగా మారుస్తాయి.ఎదిగిన పురుగులు కాయలపై రంధ్రాలు చేసి బయటకు వచ్చి కాయలపై, సంచుల పై గూళ్లు కట్టుకు౦టాయి.
  • నివారణకు కాయల్లోగాని,విత్తనాల్లో గాని తేమ శాత౦ 9కి మించి ఉండరాదు.
  • కిలో కాయలకు 5 మి.లీ వేపనూనె లేదా కానుగనూనె కలిపినచో దాదాపు 5 నెలల వరకు కాయతొలుచు పురుగు నుండి కాపాడవచ్చు.
  శనగ పచ్చ పురుగు
  • తల్లి పురుగులు లేత ఆకుల మీద,పూమొగ్గల మీద తెల్లని గ్రుడ్లను పెడతాయి.
  • లార్వా శరీరం మీద పలచటి నూలు లాంటి రోమాలు ఉంటాయి.
  • మొగ్గలను,పువ్వులను ఎక్కువగా తింటాయి.
  • లింగాకర్షణ బుట్టలు వాడి ఉధృతి తెలుసుకోవాలి.
  • గ్రుడ్డు దశలో ట్రైకోగ్రామా కార్డులను ఉపయోగించాలి (21/2 కార్డు ఎకరాకు).
  • గ్రుడ్డు దశ,చిన్న పురుగు దశలలో వేప గింజల కషాయం బాగా పని చేస్తుంది.
  • పక్షి స్థావరాలు ఎకారాకు 10 చొప్పున పెట్టాలి.
  • నివారణకు కాయల్లోగాని,విత్తనాల్లో గాని తేమ శాత౦ 9కి మించి ఉండరాదు. బిటి ద్రావణం ఎకరాకు 400మి.లీ లేదా ఎన్.పి.వి వైరస్ ద్రావణం.
  • 100మి.లీ ఎకరాకు పిచికారి చేయాలి.
  • ఒక లీటరు నీటికి ఎండోసల్ఫాన్ 2.0మి.లీ లేక క్వినాల్ఫాస్ 2.0 మి.లీ లేదా ఎసిఫేట్ 1.0 గ్రా.చొప్పున పిచికారి చేయాలి.
  పేనుబ౦క
  • బెట్ట పరిస్థితులలో వీటి ఉధృతి అధికం.వర్శాలోస్తే ఉధృతి తగ్గుతుంది.
  • మొవ్వలు,లేత ఆకులు,రెమ్మలనుండి రసాన్ని పీలుస్తాయి.
  • అక్షింతల పురుగులు,సిర్పిడ్స్,లేస్ వింగ్స్ వంటి భక్షకాలు,పేనుబంకను సమర్ధవంతంగా నివారిస్తాయి.
  • మొవ్వుల మీద పేనుబంక అధికంగా ఉన్నప్పుడు డైమిధోయేట్ 2మి.లీ లేదా మోనోక్రోటోఫాస్ 1.6మి.లీ లీటరు నీటిలో కలిపి పిచికారి చేసి సులభంగా నివారించవచ్చును.
  వేరుశనగ పంటనాశి౦చు తెగుళ్ళు - నివారణా చర్యలు

  మొవ్వకుళ్ళు తెగులు(బడ్ నెక్రొసిస్ వైరస్ తెగులు)

  • ఇది వైరస్ తెగులు,తామర పురుగుల ద్వారా వ్యాపిస్తుంది.
  • లేత ఆకులపై నిర్జీవ వలయాలు లేక చారలు కనిపిస్తాయి.ముదురు ఆకుల్లో ఈ లక్షణాలు కనిపించవు.
  • లేత దశలో తెగులు ఆశిస్తే మొక్కలు కురుచబడి,ఎక్కువ రెమ్మలు వస్తాయి.ఆకులు చిన్నవిగా అయి లేత ఆకుపచ్చ మచ్చలు కల్గి పాలిపోయి ఉంటాయి. 15రోజుల తర్వాత తెగులు ఆశిస్తే మొవ్వు ఎండిపోయి,కుళ్ళిపోతుంది.క్రమంగా మొక్క అంతా ఎండిపోతుంది.
  • వేర్లు,ఊడలు,కాయల మీద మచ్చలు ఏర్పడి కుల్లిపోతాయి.ఈ తెగులు సోకిన మొక్కలనుండి వచ్చిన వేరుశనగ విత్తనాలు చిన్నవిగా ఉండి,ముడుచుకొని ఉంటాయి.
  • నివారణకు తెగులును కొంతవరకు తట్టుకునే కదిరి-3,ఆర్ 8808,వేమన,ఐ.సి.జి.యస్-రకాలను సాగుచేయాలి.
  • వేరుశనగతో సజ్జ పంటను 7:1 నిష్పత్తిలో అంతర పంటగా వేయాలి.
  • విత్తిన 20రోజుల తర్వాతతామర పురుగుల(త్రిప్స్)వ్యాప్తి అరికట్టడానికి మోనోక్రోటోఫాస్ 1.6మి.లీ.లేక డైమిధోయేట్ 2మి.లి.లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.
  ఎర్లి తిక్కా ఆకుమచ్చ తెగులు
  • త్వరగా వచ్చే ఆకుమచ్చ తెగులు మచ్చలు కొంచం గుండ్రంగా వుండి,ఆకు పైభాగాన ముదురు గోధుమ రంగు కల్గి వుంటాయి.
  • ఆలస్యంగా వచ్చే ఆకుమచ్చ తెగులు మచ్చలు చిన్నవిగా,గుండ్రంగా వుండి,ఆకు అడుగు భాగాన నల్లని రంగు కల్గి వు౦టాయి.కాండం మీద,ఆకు కాడల మీద,ఊడల మీద కూడా మచ్చలు ఏర్పడతాయి.
  • వేరుశనగలో సజ్జ పంటను 7:1 నిష్పత్తిలో అంతర పంటగా వేయాలి.
  • నివారణకు తెగులును తట్టుకునే రకాలను(వేమన,జె.సి.జి-88) సాగుచేయాలి.
  • తెగులు కనిపించిన వెంటనే ఎకరాకు మా౦కోజెబ్ 400గ్రా.లేదా కార్బ౦డజిమ్ 200గ్రా.లేదా క్లోరోథలోనిల్ 400గ్రా.లేదా హెక్సాకొనాజోల్ 400 మి.లీ చొప్పున 200లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి.
  కా౦డం కుళ్ళు వైరస్ తెగులు(స్టెమ్ నేక్రొసిస్ వైరస్ తెగులు)
  • టొబాకొ స్ట్స్ట్రీక్ వైరస్ ఈ తెగులను కలగచేస్తుంది.
  • ఈ తెగులు సోకిన మొక్కల్లో మొవ్వు చనిపోతుంది,క్రమేణ కాండం అంతా నల్లగా మారి మొక్క చనిపోతుంది.కాయలు,ఊడలు నల్లగా మారి కుళ్ళిపోతాయి.
  • ఈ వైరస్ వేరుశనగ లేని సమయంలో గట్ల పైన వున్న కలుపు మొక్కలపై జీవిస్తుంది.కలుపు మొక్కల్లో ముఖ్యంగా వయ్యారిభామ(కా౦గ్రెస్ గడ్డి),ఉత్తరేణి,ఎన్నెద్దులాకు,కుక్కముళ్ళు మరియు గరిటికమ్మ పువ్వుల్లోని పుప్పొడి రేణువుల్లో వుంటుంది.
  • ఈ పుప్పొడి రేణువులు,తామర పురుగుల ద్వారా ఇంకా గాలి ద్వారా వేరుశనగ ఆకులపై పడి తామర పురుగులు ఆకుపై గోకినప్పుడు ఈ పుప్పొడి రేణువుల్లోని వైరస్ కణాలు మొక్కలోనికి ప్రవేశించి కాండం కుళ్ళు కలుగచేస్తాయి. సాగుచేయాలి.
  • తెగులు ఆశి౦చడంవలన ప్రారంభ దశలో మొక్క మొదలులో వున్న శాఖలు పసుపు వర్ణానికి మారి ఎండిపోతాయి. తరువాత కా౦డం,కొమ్మలపైన తెల్లటి బూజు తెరలుగా ఏర్పడతాయి.ఈ తెల్లటి బూజులో ఆవగింజ పరిమాణంవున్న స్క్లీరోషియాలు ఏర్పడతాయి.ఊడలు,కాయలు కూడా ఈ తెగులుకు లోనవుతాయి.కాయలోని గి౦జల పై నీలి బూడిదరంగు మచ్చలు ఏర్పడతాయి.
  • ఈ తెగులు ఆశించిన మొక్కలను పీకినప్పుడు నేలపై వున్న మొక్క భాగాలు మాత్రం వూడివస్తాయి.వేరు,కాయలు నేలలోనే వు౦డిపోతాయి. సజ్జ,జొన్న వంటి పంటలతో పంట మార్పిడి చేయాలి.
  • కిలో విత్తనాలకు 1గ్రాము కార్బ౦డజిమ్ లేదా 3గ్రా.ల కాఫ్టాన్ కలిపి విత్తన శుధ్ధి చేయాలి.
  • రెండు కిలోల ట్రైకోడెర్మావిరిడె ఫార్ములేషన్ 50కిలోల పశువుల ఎరువుతో కలిపి నీరుచల్లి,పోలిథీన్ కాగితంతో కప్పి 15 రోజుల తర్వాత ఒక ఎకరా భూమిలో విత్తేముందు చల్లాలి.
  తిక్కా ఆకుమచ్చ తెగులు
  • త్వరగా వచ్చే ఆకుమచ్చ తెగులు మచ్చలు కొంచం గుండ్రంగా వుండి,ఆకు పైభాగాన ముదురు గోధుమ రంగు కల్గి వుంటాయి.
  • ఆలస్యంగా వచ్చే ఆకుమచ్చ తెగులు మచ్చలు చిన్నవిగా,గుండ్రంగా వుండి,ఆకు అడుగు భాగాన నల్లని రంగు కల్గి వు౦టాయి.కాండం మీద,ఆకు కాడల మీద,ఊడల మీద కూడా మచ్చలు ఏర్పడతాయి.
  • వేరుశనగలో సజ్జ పంటను 7:1 నిష్పత్తిలో అంతర పంటగా వేయాలి.
  • నివారణకు తెగులును తట్టుకునే రకాలను(వేమన,జె.సి.జి-88) సాగుచేయాలి.
  • తెగులు కనిపించిన వెంటనే ఎకరాకు మా౦కోజెబ్ 400గ్రా.లేదా కార్బ౦డజిమ్ 200గ్రా.లేదా క్లోరోథలోనిల్ 400గ్రా.లేదా హెక్సాకొనాజోల్ 400 మి.లీ చొప్పున 200లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి.
  తుప్పు లేక కుంకుమ తెగులు
  • ఆకుల అడుగు భాగంలో ఎరుపు-ఇటుక రంగు గల చిన్న పొక్కులు ఏర్పడి ఆకు పైభాగంలో పసుపు రంగు మచ్చలు కన్పిస్తాయి.
  • తెగులు ఉధృతి ఎక్కువైనప్పుడు ఈ పొక్కులు పూల మీద తప్ప మొక్క మిగతా అన్ని భాగాల మీద కన్పిస్తాయి.
  • ఈ తెగులు రబీలో ఉధృతంగా ఆశిస్తుంది.
  • నివారణకు లీటరు నీటికి 2గ్రా.క్లోరోథలోనిల్ లేక 2గ్రా.ట్రైడిమార్ప్ లేదా 2గ్రా.మా౦కోజెబ్ కలిపి మొక్కలు తడిచే విధంగా పిచికారి చేయాలి.
  ఆముదము

  ఆముదము సమగ్రసస్యరక్షణ

  ఆముదము పంటను ముఖ్య౦గా దాసరిపురుగు,లద్దె పురుగు,గొంగళి పురుగులు ఆశించి తీవ్ర నష్టాన్ని కలుగజేస్తాయి.ఎండుతెగులు,బుజుతెగులు కూడా ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తాయి. ఎర్రగొంగళి పురుగు మొక్క దశలో జూలై-ఆగస్టు మాసములో ఆశించి మొక్కలను నాశనము చేస్తుంది.ఎదిగిన పంటలో తీవ్రంగా ఆకుకు నష్టము చేస్తుంది.దొసరి పురుగు జూలై నుంచి అక్టోబర్ వరకు ఆకులపై రంధ్రాలు ఏర్పరచి,ఆకులకాడలు,ఈ నెలు మాత్రమే మిగుల్చుతుంది.ఈ పురుగు లేదా గెలలను కూడా ఆశిస్తుంది.లద్దె పురుగులు ఆకుల అడుగు భాగంలో పత్రహరితాన్ని గోకడం వలన,ఆశించిన ఆకులు పలుచటి కాగితం మాదిరిగా కనిపిస్తాయి.పురుగులు ఆకు అడుగుభాగంలో ఉంటాయి.రంధ్రాలు ఏర్పడి ఆకులు జల్లెడలా మారుతాయి.ఎదిగిన లద్దె పురుగులు ఆగుష్టు మాసం నుండి సెప్టెంబరు వరకు గెలలపై కూడా కనిపిస్తాయి. గొంగళి పురుగు ఆముదము పంటను సెప్టెంబర్-నవంబర్ మాసంలో ఆశించి ఆకులలో రంధ్రాలు ఏర్పరచి తీవ్రమైన నష్టాన్ని చేస్తుంది.ఈ పురుగు కాయలను కూడ గోకి తింటుంది.ఆముదము పంట వేసిన 20-60 రోజుల వరకు ఎండు తెగులు వస్తుంది.మొక్క దశలో సోకినచో ముందుగా ఆకులు వడలి తరువాత మొక్క ఎండిపోతుంది.ఎదిగిన మొక్కలలో గెలరాలిపోతుంది.బూజు తెగులు ఆగుష్టు మాసము నుండి నవంబరు వరకు ఆముదము. పంటను ఆశిస్తుంది.గెల దశలో గోధుమ రంగు మచ్చలు ఏర్పడి,కాయ ముందుగా మెత్తగా అయి కుళ్ళి రాలిపోతుంది.గెల పై బూజు కనిపిస్తుంది.సమగ్ర సస్య రక్షణ చర్యలు. ఎండు తెగులు గమనించిన ప్రాంతాల్లో తట్టుకునే జ్యోతి రకం మరియు జిసిహెచ్-4,డిసిహెచ్-32,డిసిహెచ్-117,హైబ్రిడ్ లను విత్తుకోవాలి. ఎండు తెగులు తీవ్రంగా ఉన్న ప్రాంతములలో జొన్న లేక సజ్జ పంటలతో 2-3 సంవత్సరములు పంటమార్పిడి చేయాలి.కంది అంతరపంటగా వేసి ఎండు తెగులు ఉధృతిని తగ్గించవచ్చు.

  తెగులు సోకిన మొక్కలను గుర్తించిన వెంటనే పీకివేసి నాశనం చేయవలయును.

  అరుణ,క్రాంతి మరియు దేశవాళి రకాలలో ట్రైకోడర్మా జీవనియంత్రణ శిలీ౦ధ్రము(తెల్లని పొడి మందు)కిలో విత్తనానికి 10గ్రా మందుతో విత్తన శుధ్ధి చేయాలి.కార్బె౦డిజమ్ 2గ్రా.1కిలో విత్తనానికి చొప్పున కలిపి విత్తన శుధ్ధి చేయాలి.

  ఎర్రగొంగళి పురుగులు తేలికపాటి నేలలు వున్న ప్రాంతాలలో ఎక్కువగా రావడానికీ అవకాశం వుంది.తొలకరి వర్షాలు పడిన తరువాత వరుసగా 2-3 రోజులు రాత్రి 7 నుంచి 11గ౦.మధ్య సమయంలో రైతులందరు సామూహికంగా మంటలు పెట్టడం లేదా విద్యుత్ సౌకర్యం ఉన్న చోట బావుల దగ్గర దీపపు ఎరలను ఉంచినట్లైతే రెక్కల పురుగులు ఆకర్షితమౌతాయి.వాటిని ఏరి నాశనము చేయాలి.పైరు విత్తటానికి వారం రోజులముందు పొలం గట్లపైన దోస నాటితే గొంగళి పురుగు దోస మొక్కలను ఆశిస్తుంది.పురుగులను ఏరి నాశనము చేయటానికి వీలుగా ఉంటుంది.దోస నాటని పక్షంలో ఎదిగిన పురుగు గుంపులుగా పంటలో ప్రవేశించకుండా పొలం చుట్టూ జిల్లేడు,లొట్టపీచు,అడవి ఆముదము ఆకులను ఎరగా పెట్టి పురుగులను ఏరి చంపాలి.

  పొలంచుట్టూ లోతైన నాగటి చాలును తీసి అందులో కీటకనాశిని(ఎండోసల్ఫాన్ లేదా క్వినాల్ ఫాస్)పొడిని చల్లి,ఒక పొలం నుంచి మరొక పోలంలోకి ప్రయాణి౦చకుండా పురుగులను నివారించవచ్చును.70మీ.చాలు లో 1కిలో పొడిమందును చల్లాలి.

  ఆముదము పంటలో రెండోసారి కలుపు తీసిన తరువాత పక్షులు వాలడానికి అనుకూలంగా ఎకరానికి 10పక్షి స్థావరాలు(పంగ కర్రలు) పెట్టినట్లైతే ఉధృతి తగ్గుతుంది.

  విత్తనం మొలకెత్తిన నెల తర్వాత దాసరిపురుగు,రెక్కలపురుగు పంటలో ఎక్కువ సంఖ్యలో గుడ్లు పెట్టకుండా వేప కషాయం గాని సీతాఫల ఆకు కషాయము గాని 5మి.లీ.నీటిలో కలిపి పిచికారి చేయాలి.

  ఎకరానికి 2-3 లింగాకర్షపు ఎరలను అమర్చి,పురుగుల యొక్క ఉనికిని తెలిసికొని,వాటి నివారణ చర్యలను చేపట్టవలయును

  పంట 30-60 రోజుల వయసులో దాసరి పురుగుల ఆశిస్తుంది.ఆకు అడుగు భాగంలో విడివిడిగా పెటిన ఆకుపచ్చని గ్రుడ్లను గమనించిన వెంటనే ట్రైకోగ్రామా పరాన్నజీవి గ్రుడ్ల అట్టలను ఎకరానికి ఒకటి లేదా రెండింటిని ముక్కలుగా కత్తిరించి పొలంలో అక్కడక్కడా ఆకులకు కుట్టాలి,లేదా నాలుగు రోజుల వ్యవధిలో ఎం.పి.వైరస్ ద్రావణాన్ని ఎకరానికి 200 యల్.ఇ.మందును ఆరకిలో బెల్లం మరియు 50మి.లి.రాబిన్ బ్లూ కలిపి పిచికారి చేయాలి.

  ఎదిగిన పురుగుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లయితే బి.టి.మందును1.5 గ్రా లేదా క్వినాల్ ఫాస్ 2మి.లీ ఒక లీటరు నీటికి కలిపి ఆకుల అడుగు భాగం తడిసేల పిచికారి చేయాలి.

  దాసిరి పురుగు ఆగుష్టు మాసం నుండి మైక్రోప్ల్ప్లైటిస్ అనే పరన్నా జీవి ఎక్కువగా ఆశిస్తుంది.ఈ మిత్రి పురుగును రైతులు సులువుగా గుర్తించవచ్చు.మొక్కపై 50 శాతము పురుగులలో ఈ మిత్రి పురుగు కనిపించినట్లయితే దాసిరి పురుగు నివారణకు మందులు పిచికారి చేయాల్సిన అవసరము లేదు.

  లద్దె పురుగు సోకిన ఆకుల అడుగు భాగంలో పురుగు తొలిదశలో గుంపులుగా వుంటాయి.అలాంటి ఆకులను దూరం నుండీ సులువుగా గుర్తించి,ఏరి,నాశనం చేయాలి.

  కాయతొలుచు పురుగు ఆశించిన వెంటనే కాయలను ఏరివేసి పురుగులతో సహ నాశనం చేయవలయును.వీటి ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే మోనోక్రోటోఫాస్(1.5మి.లీ./లీటరు నీటికి)లేదా క్లోరోపైరిఫాస్(2మి.లీ./లీటరు నీటికి)పిచికారీ చేయవలయును.

  సెప్టెంబరు,అక్టోబరు మాసాల్లో పంట గింజ కట్టే దశలో గాలిలో తేమ అధికంగాను,రాత్రి ఉష్ణోగ్రత 22 డిగ్రీల లోపు సుమారు నాలుగైదు రోజులు వరుసగా ఉనట్లైతే బూజు తెగులు ఎక్కువగా ఆశిస్తుంది.తెగులును పూర్తిగా తట్టుకునే వంగడాలు లేనందున సోకిన గెలలను తుంచి నాశనం చేయడంతో పాటు కార్బె౦డిజమ్ అనే శిల్లీంధ్ర నాశిక మందును 1గ్రా 1లీటరు నీటికి చొప్పున కలిపి తంగులు ఉధృతిని బట్టి 10 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేసి ఈ తెగులును అరికట్టవచ్చు.

  గెలలో కాయాలి విడివిడిగా ఉండే రకములను విత్తుకోవడం వలన కాయతొలుచు పురుగు మరియు బూజు తెగుళ్ళ తీవ్రతను తగ్గించవచ్చును.

  వేసవిలో భూమిని లోతుగా దున్నడము వలన కోశస్థ దశలోని పురుగులను,శిల్లీంధ్రములను,బాక్టీరియాలను నాశనము చేయవచ్చును.

  పొలంలో వర్షపు నీరు నిలువ ఉండకుండా చుసుకోనవలయును.

  జొన్న పంట

  జొన్న పంట సంగ్రసస్యరక్షణ

  జోన్నపంటలో తీవ్ర నష్టాన్ని కలిగించే పురుగులలో మువ్వ తొలిచేపురుగు,కంకినల్లి,పేనుబంక,అగ్గిపురుగు మరియు మలికంకి ముఖ్యమైనవి.తెగుళ్ళలో కాటుక తెగులు మరియు బూజు తెగులు ఈ పంటను ఆశిస్తాయి.

  మువ్వతొలిచే ఈగ పంట విత్తినప్పటి నుంచి నెల రోజులలోపు విపరీతంగా నష్ట పరుస్తుంది.కాండము తొలిచే పురుగులు విత్తిన రెండువారాల తరువాత నుండి పంటకోత కోసేవరకు వస్తుంది.కాండము తొలిచే పురుగులు పిలక మధ్యభాగాన్ని కొరికి వేయడం వలన మొవ్వఎండిపోయి క్రమేణ చనిపోతుంది.ఎండిన మొవ్వలు పీకితే తేలికగా వస్తాయి.కంకినాశించి విపరీతంగా నష్టపరుస్తుంది.

  ఖరీఫ్ తొలకరి వర్షాలు పడిన 7-10 రోజులలోపు,రబీలో సెప్టెంబర్ చివరి వారం మొదలుకొని అక్టోబర్ మొదటి వారంలోపు విత్తుకుంటే మువ్వతొలిచే ఈగను చాలావరకు నివారించుకోవచ్చును.

  విత్తనము విత్తేటప్పుడు ఎకరాకు 1-1.5 వరకు కి.గ్రా.ఎక్కువ విత్తనము వాడి సాళ్ళలో మొక్కలని దగ్గరగా విత్తుకొని,మువ్వకుళ్ళు సోకిన మొక్కలని ఏరి వేయడం వలన కూడా ఈగబారినుండి జొన్న పంటను కాపాడుకోవచ్చు.

  ఈగ లేదా కాండం తొలుచు పురుగు సోక ఎండిపోయిన మొక్కలను పొలం నుంచి ఏరి నాశన౦ చేయాలి.

  పంట కోసేటప్పుడు భూమికి దగ్గరగా కోయడం,భూమిలో ఉన్న పంట అవశేషాలను నాశనం చేయడం వలన కాండం తొలుచుపురుగు,కంకిదోమ వంటి పురుగుల కోశస్త దశలను సమూలంగా నాశనం చేయవచ్చు.

  వేసవిలో లోతుగా దుక్కి చేయడం వలన భూమి లోపల,కోయ్యాలలో,కలుపు మొక్కలలో ఉన్న పురుగుల కోశాస్థ దశలు భూమిపైకి వచ్చి పక్షులబారిన పడటం లేదా ఎండ వేడిమికి లోనై నశిస్తాయి.దీనివలన రాబోవు పంటలో పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చు.

  ఒకే రకమైన జొన్నను,సకాలంలో,ఒకే సమయంలో,ఎక్కువ విస్తీర్ణంలో విత్తుకోవడం వలన మువ్వ ఈగ,కంకినల్లి,మరియు అగ్గి పురుగుల ఉధృతిని తగ్గించవచ్చు.జొన్నపంటను వేరుశెనగ,పొద్దుతిరుగుడు లేదా ప్రత్తితో పంట మార్పిడి చేయడం వలన మువ్వ ఈగ మరియు కంకినల్లి ఉధృతిని తగ్గించవచ్చు.

  జొన్నలో అలసందులు అంతర పంటగా వాడటం వలన కాండం తొలిచే పురుగు ఉధృతిని 50 శాతము వరకు తగ్గించడమే కాకుండా,పంట దిగుబడిని 10-12 శాతము దాకా పెంచుకోవచ్చు.

  చీడపీడల బారినుండి తట్టుకునే జొన్న రకాలు(ఎమ్ 35-1,సి.హెచ్.హెచ్-15ఆర్)మువ్వ తొలిచే ఈగను తట్టుకొని రబీ పంటకాలంలో మంచి దిగుబడి ఇస్తాము.అదే విధంగా డి.ఎస్.వి-3 మరియు డి.జె-6514 లు అగ్గి పురుగుతాకిడిని తట్టుకునే రకాలు. క్రిమి సంహారక రసాయన మందులను అవసరం అయితేనే ఆఖరి అస్త్రంగా వాడుకోవాలి.

  కార్బోఫ్యురాన్ 3జి గుళికలను మువ్వతోలిచే ఈగ నివారణకు చాళ్ళలో విత్తేటప్పుడు ఒక మీటరు చాలుకు 2 గ్రా.చొప్పున వేయాలి.ఏండో సల్ఫాన్ 35 ఇ.సి.2 మి.లీ ఒక లీటరు నీటికి కలిపి విత్తనం మొలచిన 7,14,21 రోజులలో పిచికారి చేయాలి.

  కాండం తొలుచు పురుగు నివారణకు కార్బోఫ్యురాన్ 3జి.గుళికలను మొక్కల సుడులలో 2-3 గుళికలు మొక్కకు చొప్పున మొలకెత్తిన 25 మరియు 35రోజుల తరువాత వేయాలి.

  కంకినల్లి,అగ్గిపురుగుల నివారణకు ఎండోసల్ఫాన్ 4డి. లేదా మలాథియాన్ 5డి మందులు ఎకరాకు 8కిలోల చొప్పున వాడాలి.పేనుబంక ఆశిస్తే మెటాసిస్టాక్స్ లేదా నువాక్రాన్ 2.మి.లీ ఒక లీటరు నీటికి కలిపి మొలకెత్తిన 40రోజుల తరువాత పిచికారి చేయాలి.

  కాటుక తెగులు రాకుండా కాప్తాన్ (౩ గ్రా./కిలో. విత్తనానికి) తో విత్తన శుధ్ధి చేసి విత్తాలి.బూజుతెగులు రాకుండా కాప్టాన్ తో విత్తన శుధ్ధి చేసి,గింజ పట్టే దశలో ఆరియోఫంగిన్ 200 పిపిఎమ్ మరియు కాప్టాన్ (2 గ్రా./లీ.) కలిపి పిచికారి చేయాలి.

  సమగ్ర సస్యరక్షణ వీడియో