బెల్లం తయారీ:

బెల్లం తయారీలో మెళుకువలు:

బాగా పక్వానికోచ్చిన చెఱకునే బెల్లం తయారీకి ఉపయోగించాలి.చెఱకును భూమట్టానికి నరికి,వెంటనే గానుగాడి బెల్లం చేసుకోవాలి.చచ్చిన,ఎలుకలు కొట్టిన,గాలి పెడలతో వచ్చిన పిలక వంటి చెఱకులను ఏరివేసి,మంచి చెఱకులనే ఉపయోగించి,బెల్లం చేయాలి.అనివార్య పరిస్థితుల్లో,వెంటనే బెల్లం చేయలేకపోయినప్పుడు,చెఱకు మోపులను నీడలో గుట్టలుగా ఉంచి ,చెఱకు చెత్త కప్పి,పలచగా నీరు చల్లితే చెఱకు తూకం,రస నాణ్యత తరుగుదల తక్కువ గా ఉంటుంది. తక్కువ శక్తితో, ఎక్కువ రసపు దిగుబడికి గానుగల సామర్ధ్యం పెంచే౦దుకు నిలుపు క్రషర్ల కంటే ,అడ్డు క్రషర్లు ఉపయోగించటం మంచిది.గానుగలు:

  • 1.తక్కువ శక్తితో ,ఎక్కువ రసపు దిగుబడికి గాను గల సామర్ధ్యం పెంచేందుకు నిలుపు క్రషర్ల కంటే,అడ్డు క్రషర్లు ఉపయోగించటం మంచిది.
  • 2. అడ్డు క్రషర్లు వాడి ఒకటన్ను చెఱకు నుండి 650 కిలోల రసం,120 కిలోల బెల్లపు దిగుబడి పొందవచ్చు.
  • 3.ఫలితంగా ఒక టన్ను చెఱకు నుండి 100 నుండి 200 రూ విలువగల 10-20 కిలోల బెల్లం అదనంగా పొందవచ్చు.
  • 4.రోలర్ల ఉండే నొక్కులు పిప్పితో నిండి ఉండకుండా శుభ్రపరచాలి.
  • 5.ఒకే సమయంలో 2-3 చెఱకు గడలు మాత్రమే గానుగాడు కోవాలి.


పెనాలు:

బెల్లం తయారీకి ఉపయోగించే పెనాలు వెడల్పుగా ఉండి(240-270 సెం.మీ)లోతు తక్కువగా (45సెం.మీ) ఉండాలి.పెన౦గోడలు 16గేజి ఇనుప రేకుతోను అడుగున 18గేజి కళాయి రేకుతోను చేయడం మంచిది.


అనకాపల్లి పొయ్యి:

అనకాపల్లి పొయ్యి ఉపయోగించి బెల్లం చేయుటకు తక్కువ ఇంధనం అంటే మరగ బెట్టే రసం మీద షుమారు 37శాతం ఆరిన చెఱకు పిప్పి,చెఱకు చెత్త అయితే 45శాతం వంట చెఱకుగా కావాల్సి ఉంటుంది.ఒక పాకం అంటే360 కిలోల రసందించుటకు (మార్చి లో)షుమారు రెండు గంటలు పడుతుంది.రసం త్వరగా మరుగుట వలన నాణ్యమయిన బెల్లం పొందవచ్చు.పొయ్యి మధ్యన గల అడ్డుగోడ వలన,పొయ్యి లోని వేడి ,గొట్టం ద్వారా పైకి వృధాగా పోకుండా ఉంటుంది.


రసాన్ని శుభ్రపరచడం:

రసాన్ని శుభ్రపరచటానికి ఆమ్ల స్థితికి అంటే 5.2 ఉదజని సూచిక ఉన్న రసానికి సున్నం కలిపి ,5.8వరకు తీసుకొని రావలసి ఉంటుంది.ఈ విధంగా చేయడానికి ప్రత్యేక ఉదజని సూచిక కాగితాలు ఉపయోగించాలి.సోడా కలిపితే,బెల్లం మెత్తబడి నాణ్యత దెబ్బ తింటుంది.పక్వానికి వచ్చిన చెఱకు రసానికి ఉదజని సూచిక 5.8 వచ్చేవరకు,పక్వానికి రాణి చెఱకు అయితే 6.4 వచ్చే వరకు,రసం విరిగిన చెఱకుకయితే 6.6వచ్చేవరకు సున్నం కలిపి మంచి బెల్లం తయారుచేయవచ్చు.బెండమొక్కల గుజ్జువంటి వృక్ష సంభందం మయిన పదార్థాములను,సున్నముతో కలిపి నాణ్యమైన బెల్లం తయారు చేసుకోవచ్చు.


బెల్లం వండటం:

రసం మరిగీతప్పుడు ,ఎప్పటికప్పుడు తెట్టును పూర్తిగా తీఇవేయాలి.తెట్టును తీసివేసిన తర్వాత రసాన్ని త్వరగా మరిగించాలి.బురద పొంగు సమయంలో రసం పొంగుతుందనుకుంటే,నువ్వుల నూనె చిలకరించాలి.పాకం ఉష్ణోగ్రత 118 సెల్సియస్ వచ్చినప్పుడు పెనం దించాలి.పెనందించిన తర్వాత చంద్రవంక బల్లతో బాగా కలిపి చల్లరిన తర్వాత 5నిమిషాలు కదపకుండా ఉంచితే,బెల్లం మంచి రవ్వ కట్ట కలిగి ఉంటుంది.బెల్లం చల్లబడి గట్టిపాడడం ప్రారంభి౦చగానే,వివిద రకాల అచ్చుల్లో వేసుకోవచ్చు.


బెల్లం తయారీలో హైడ్రోసు వాడకుండుట:

హైడ్రోసులో గంధకం ఉంటుంది.ఒక క్వింటాల్ బెల్లం లో 7 గ్రాముల కంటే ఎక్కువ సల్ఫర్ డయాక్సైడ్ ఉంటే ఆరోగ్యానికిహాని కలుగుతుంది.400 లీటర్;అ రసానికి 100 గ్రాముల హైడ్రోసు వేసి తయారు చేసిన బెల్లం లో క్వింటాలుకు 7-12గ్రా వరకు సల్ఫర్డయాక్సైడ్ ఉంటుంది.రైతులు ఎక్కువ పరిమాణంలో (1-2కిలోల)హైడ్రోసు వేసి తెల్లని బెల్లం చేస్తే,సల్ఫర్డయాక్సైడ్ పరిమాణం ఉండవలసిన దానికన్నా 2-3రెట్లు ఎక్కువగా ఉంటుంది.హైడ్రోసు వేసిన బెల్లం రుచికి వెగటుగా ఉండి,రంగు 2-3 వారాలకు మించి ఉండక,త్వరగా మెత్తబడి,ఎక్కువకాలం నిల్వ ఉండదు.వినియోగదారులు బెల్లం రంగుకు ప్రాధాన్యత ఇవ్వకుండా,నాణ్యతను గమనించాలి.హైడ్రోసు వాడిన బెల్లాన్ని ప్రోత్సహించకూడదు.


ముక్కల రూపంలో బెల్లం తయారీ:

బెల్లాన్ని చిన్న ముక్కలుగా (50గ్రా,200గ్రా,500గ్రా,1కిలో క్యూబులు/బ్లాకులు) తయారు చేసి ,నీడలో ఆరబెట్టటంవలన తేమ శాతం 4-5 వరకు తగ్గి ,పాలీధీన్ సంచుల్లో ప్యాకింగ్ చేస్తే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది.ముక్కాల రూపంలో బెల్లం చేయడం వలన,క్వింటలు కు అదనంగా రూ200 వరకు అంటేఎకరం చెఱకు తోటనుండి వచ్చే సుమారు 4 టన్నుల బెల్లంనుండి రూ8000 వరకు అదనంగా పొందవచ్చు.


బెల్లం నిల్వ చేయటం:

బెల్లాన్ని ఆరబెట్టి ,గాదెల్లో నిల్వచేయవచ్చు.100 కిలోల బెల్లం వరకు రైతు స్థాయిలో నిల్వ ఉంచవచ్చు.గాదె అడుగు భాగాన అప్పుడే కాల్చిన సున్నాన్ని తేమ పీల్చు పదార్ధంగా ఉంచి ,బెల్లం నాణ్యత చెడకుండా సంవత్సరం పొడవునా నిల్వ చేయవచ్చు.బెల్లం గోదాములో వెదురు బొంగులతో చేయబడిన అటకలపై బెల్లం ఉంచి,క్రింద అప్పుడే కాల్చిన సున్నాన్నిఉంచి బెల్లం ఎక్కువ పరిమాణంలో నిల్వ చేసుకోవచ్చు.కోల్డ్స్తోరేజిలలో కూడా బెల్లం నాణ్యత చెడకుండా నిల్వ ఉంచుకోవచ్చు.


బెల్లపు పాకం:

బెల్లపు పాకంలో పంచదార(50శాతం),గ్లూకోజ్ ,ప్రక్త్తోజ్(20శాతం) మాంస కృత్తులు(౦.2శాతం),కాల్షియం(0.3శాతం),మెగ్నీషియం,పొటాషియం,భాస్వరం(0.3శాతం),ఇనుము (11మి.గ్రా/100గ్రాములు ),సిట్రిక్ ఏసిడ్,విటమిన్ ఎ మరియు బిలు తగినంతగా ఉంటాయి.బెల్లపు పాకాన్ని ఎక్కువగా అల్పాహారంగా తియ్యటి పదార్ధంగా వాడుకోవచ్చు.బెల్లపు పాకాన్ని సీసాలలో పట్టి,భారీస్థాయిలో మార్కెట్ చేయటానికి ఎక్కువ అవకాసం కలదు.ఎకరా చెఱకు తోటనుండి వచ్చే సుమారు 5 టన్నుల బెల్లపు పాకంనుండి,బెల్లపు దిమ్మల ద్వారా వచ్చు లాభంకన్నా 2- 3 రెట్లు అదనంగా లాభం పొందవచ్చు, నిల్వకు,ఎగుమతులకు బూరుగుపల్లి బెల్ల౦ ఎంతో అనుకూలం.బూరుగుపల్లి బెల్లం మంచి నాణ్యత,తక్కువ తేమ ,ఎక్కువ గట్టిదనం కలిగి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది.


బెల్లం పొడి:

బెల్లపు పొడి మంచి పోషకపు విలువలు,నాణ్యతాప్రమాణాలు కలిగి ఉంటుంది.తక్కువ తేమ (2శాతం)కలిగి ఉండటం వలన ఎక్కువ కాలం (2-3 సంవత్సరాలవరకు) నాణ్యత చెడకుండా నిల్వ ఉంటుంది.బెల్లపు పొడి ప్యాకింగుల లో లభ్యమగుట వలన ,వాడుకకు పరిశుభ్రంగాను,సౌకర్యంగాను మరియు ఎగుమతికి వీలుగా ఉంటుంది.పొడి రూపంలో బెల్లం చెయడ౦ వలనక్వింటాలుకు రూ18750 వరకు అదనంగా పొందవచ్చు. -ఫిల్టర్ మడ్డి:nil -మొలాసిస్:nil -పంచదార:nil