1.ఆకుమచ్చ తెగులు

ఈ తెగులు పూత మొదలయ్యే దశ (విత్తిన 60 రోజులు) ను౦డి ఎక్కువగా ఆశిస్తు౦ది. ముఖ్యంగా ఈశాన్య ఋతు ప్రభావం వలన డిశంబరు - జనవరి మాసాల్లో వర్షాలు కురవడం లేదా ఆకాశం మేఘావృతమై వాతాపరణ౦లో తేమ 70 % మి౦చినపుడు పూతదశలో వున్నా ప౦టపై ఆశి౦చి అధిక నష్టం కలుగజేస్తు౦ది. ఈ తెగులు ఆశించిన మొక్కల ఆకుల పై గోధుమ వర్ధంలో గుండ్రటి మచ్చలు ఏర్పడి ఆకులు మట్టి రంగుకు మారి ఎండిపోతాయి. నివారణ మాంకోజెబ్ 2.5 గ్రా. లీటరు నీటికి కలిపి మచ్చలు కనిపించగానే ఒకసారి, 7 ను౦డి 10 రోజుల వ్యవధి లో మరోసారి పిచికారి చేసుకోవాలి.

2.తుప్పు తెగులు

ఈ తెగులు విత్తనం మొలకెత్తిన తరువాత రె౦డు ఆకుల దశలో సోకడం వలన మట్టీ రంగు మచ్ఛలు ఏర్చడతాయి. తరువాత లేత మొక్కలు వడలి వాడెపోతాయి. పెరిగిన మొక్కలను ఈ తెగులు ఆశి౦చిసపుదడు మట్టీ రంగు తుప్పు కా౦డ౦ మరియు ఆకుల పై కనిపిప్తాయి. నివారణ మాంకోజెబ్ 2.5 గ్రా. లేదా నీటిలో కరిగే గంధకం 2.0 గ్రా లీటరు నీటికి కలిపి 15 రోజులకు ఒకసారి పిచికారి చేసుకోవాలి. సాగర్ముత్యాలు రక౦ ఈ తెగులును తట్టుకుంటుంది.

3.ప్యుజేరియం ఎండుతెగులు

ఒకే పొలంలో ప్రతిసారి కుసుమ వేస్తూ పోతే ఎండతెగులును కలుగజేసే ప్యుజేరియం అనే శిలింద్రం యొక్క ఉద్ర్హ్రుతి పెరుగుతూ పోతుంది.అది కలుగజేసే ఎండుతెగులు వల్ల పాక్షికంగా ఆకులు పసుపు బారి వడలి పోయి చివరకు మొక్కలు ఎండిపోతాయి . నివారణ ఈ తెగులు ఉద్రుతిని తగించడానికి పంట మార్పిడి తప్పనిసరి . ఈ తెగులును తట్టుకునే రకాలయిన డి.ఎస్.హెచ్ - 129 లేదా నారి ఎన్.హెచ్ - 1 లను ఎంపిక చేసుకోవాలి .