1.పెరీజియా ఆకుతినే పురుగు

ఇది శనగపచ్చ పురుగు లర్వాను పోలి ఉండి వెనుక భాగంలో మూపురాన్ని కలిగి ఉంటుంది. ఇది పంటను అన్ని దశలలో ఆశించినప్పటికీ, లేత దశలో ఉన్నపుడు ఆకులను కోరికి తినడం ద్వారా ఎక్కువ నష్టాన్ని కలగజేస్తుంది .

నివారణ
క్వినల్ఫాస్ 2.0 మీ.లీ. లేదా క్లోరిపైరిఫాస్ 2.5 మీ.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.

2.కాండం తొలిచే ఈగ

ఈ ఈగ గ్రుడ్లను పొదగబడిన తర్వాత వచ్చే డింభకాలు కాండాన్ని తొలిచి లోపలికి ప్రవేశించి భాగాన్ని తినివేయడం వలన మొక్క పైభాగం వడలి ఎండిపోతుంది .

నివారణ
డైమితోయేట్ 2.0 మీ.లీ. లేదా ఎండోసల్ఫాన్ 2.0 మీ.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.

3.పేను

కుసుమ పంటకు పేను తాకిడి చాల ప్రమాదకరమైనది .ఆలస్యంగా విత్తిన పంటపై (అక్టోబర్ రెండో పక్షంలో ) దీని ఉద్ద్రుతి ఎక్కువగా ఉంటుంది.ఇది విత్తిన 40-45 రోజుల నుండి పంటను ఆశించి ఒక వారం రోజులలో ఇబ్బడి ముబ్బడిగా సంతతిని పెనచుకున్టంది. ఇది ఎక్కువ లేత గా ఉండే మొవ్వ చిగుల్ల మరియు ఆకు అడుగు భాగాలను ఆశించి రసం పీల్చడం వలన మొక్కలు వడలి ఎండిపోతాయి . ముళ్ళులేని కుసుమ రకాలలో పెనుతాకిడి ఎక్కువ.

నివారణ
డైమితోయేట్ 2.0 మీ.లీ. లేదా మోనోక్రోటోఫాన్ 1.6 మీ.లీ. లేదా క్లోరిపైరిఫాస్ 2.5 మీ.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.