1.నేలలు

నీరు నిలువని, బరువైన,తేమను నిల్పుకునే నల్లరేగడి మరియు నిటివసతి గల ఎర్రగరప నేలలు ఈ పంటసాగుకు మిక్కిలి అనుకూలం .ప్యుజేరియం ఎండతెగులు ఎక్కువగా ఆశించే అవకాశం ఉన్న ఆమ్లత్వం గల భూములు పనికిరావు. అయితే కొద్దిపాటి క్షారత్వాన్ని కుసుమ పంట తట్టుకుంటుంది.

2.నేలతయరి

కుసుమను రెండు రకాల పంటల ప్రణాళికలో పండించుకోవచ్చు. ఎకపంటగా వేసుకునేటప్పుడు , ఖరీఫ్ కాలంలో పొలాలను బీడు పెట్టకుండా వేసవి దుక్కి చేసి మద్యలో 2-3 సార్లు గుంటకలను తోలుకున్నట్లైతే కలుపును నివారించుకోవడమే కాకుండా భూమిలోని తేమను సంరక్షించుకోవచ్చు. కుసుమను స్వల్పకాలిక ఖరీఫ్ అపరాల ( ఉదా|| పెసలు) తర్వాత వేసుకోవలనుకున్నట్లితే. ఖరీఫ్ పంటను కోసిన తరవాత పైపైన రెండు సార్లు గుంటకు తొలి కలుపు లేకుండా చేసుకొని కుసుమను విత్తుకోవాలి.