1.పక్షులు

చిన్నకంతాలలో, అక్కడక్కడ సాగుచేసిన కుసుమను రామచిలుకలు ఆశించి ఎక్కువగా నష్టపరుస్తాయి.ఇవి పంట గింజకట్టే దశ నుండి ఆశిస్తాయి .

నివారణ
గింజ పక్వమయ్యే 3 వారాలు ఉదయం మరియు సాయంత్రం సమయాల్లో పక్షులను తరిమివేయాలి .

2.పంటకోత - నిల్వ

రకాలను బట్టి విత్తన 115 నుండి 135 రోజులకు పంట కోతకు వస్తుంది . ఉదయం వేళ్ళల్లో కోయడం వల్ల గింజ రాలడం తక్కువ ఉండడమే కాకుండా ముళ్ళు మెత్తగా ఉంటాయి .మొక్కలను నేల మట్టం వరకు కోసి కట్టలు కట్టి , ఆరబెట్టి కట్టెలతో కొట్టి గాని ట్రాక్టరుతో తొక్కించి గాని గింజలను వేరుచేసుకోవాలి . తేమ 5-8 శాతం ఉండేటట్లు చూసుకుని నిల్వ చేసుకోవాలి .

3.కుసుమ పూరెకుల వినియోగం

కుసుమ పూరేకులలోగల ఔషధ గుణల పై పెరుగుతున్న అవగాహన వల్ల ఇటీవలి కాలంలో పూరేకులకు కూడా మ౦చి మార్కెటు ఏర్చడుతున్నది. కుసుమ పూరేకులతో చేసిన డికాక్షన్ లేదా టీ (తేయాకు బదులుగా) సేవి౦చడ౦ వల్ల (1) రక్త పోటు అదుపులో వు౦టు౦ది. (2) రక్త౦ లో కొలెస్టరాల్ శాత౦ తగ్గుతు౦ది. (3) కీళ్ళు నొప్పులు మరియు మెడనొప్పిలను తగ్గిస్తుంది. (4) గుండెకు రక్తాన్ని తీసుకపోయే రక్త నాళాలను వ్యకోచింప చేయడం ద్వారా గు౦డెపొటు అవకాశాలను తగ్గిస్తు౦దని వరిశోధసలలో తేలింది. కుసుమలో పూర్తిగా పూత విచ్చుకున్న దగ్గర నుండి 15-20 రోజుల తరవాత వడలి ఎండిపోయివ పూరేకులను కోయడ౦ వలన అధిక పూత దిగుబడి (ఎకరాకు సుమారుగా 25 కిలోలు) సాధించవచ్చు. మరీ ఆలన్య౦ అయిసట్లయితే పూలలో తేమశాతం పూర్తిగా తగ్గి కోసెటప్పుడు పొడిగా మారి రాలిపోతాయి.