1.విత్తే సమయం

తెలంగాణాలో సెప్టెంబర్ రెండవ పక్షం నుండి అక్టోబర్ మొదటి పక్షం వరకు , కోస్తా మరియు రాయలసీమలో అక్టోబర్ నేలలో విత్తుకోవచ్చు.పంటకాలంలో వాతావరణంలో తక్కువ తేమ మరియు అల్ప ఉష్ణోగ్రతలు పంట ఎదుగుదలకు దోహదం చేస్తాయి . ఇలాంటి అనుకూల వాతావరణ పరిస్థితిలో ఈ పంట ప్రాచుర్యం పొందింది.అయితే కోస్తా మరియు రాయలసీమలో ఈశాన్య ఋతుపవనాల ప్రభావం వల్ల డిసెంబరు ,జనవరి నెలల్లో కురిసే వర్షాలవల్ల పూత దశలో ఉన్న కుసుమ పంట ఆకుపచ్చ తెగులు బారిన పడే అవకాశం ఉంది.

2.విత్తే దూరం

వరుసల మధ్య 45సెం.మీ. మరియు వరుసలలో మొక్కల మధ్య 20 సెం.మీ.

3.విత్తనం,విత్తెపద్దతి

ఎకరానికి 4 కిలోలు (పూర్తి పంటకు), 1.5 కిలోల (అంతరపంటకు) విత్తనాన్ని గోర్రుతోగాని నాగలి సాళ్ళలో గాని ఎత్తుకోవచ్చు.విత్తనాన్ని 5 సెం.||మీ. లోతులో విత్తుకోవాలి . విత్తనం ఎక్కువ లోతులో పడితే మొలక శాతం తగ్గుతుంది. నేలలో తెమనుబట్టి,విత్తన లోతును బట్టి 4 నుండి 7 రోజులలో విత్తనం మొలుస్తుంది.

4.విత్తనశుద్ది

విత్తనం ద్వారా సంక్రమించే ఆల్టర్నేరియ ఆకుపచ్చ తెగులు , తుప్పు తెగులు మరియు భూమిలోని సిలింద్రాల ద్వారా సంక్రమించే ఎండు తేగుళ్ళను అరికట్టడానికి విత్తనసుద్ధి అత్యంత ఆవశ్యకం . 3 గ్రా. థైరామ్ లేదా కాప్టాన్ లేదా 1 గ్రా . కర్బండజిమ్ కిలో విత్తనానికి కలిపి విత్తుకోవాలి