పంటల ప్రణాళిక

కుసుమను ఏకపంటగా పండించేటప్పుడు ప్రతిసారీ ఒకే పోల౦లో ప౦డి౦చే కంటే ప్రత్తి లేదా క౦ది లా౦టి ప౦టలతో మార్పిడి చేయడ౦ వల్ల కుసుమసు ఆశించే ఎ౦డుతెగులును రాకుండా నివారించుకొవచచ్చు. పెసర లాంటి స్వల్చకాలిక ఖరీఫ్ అపరాల తర్వాత కుసుమ వేసుకోవడ౦ లాభదాయకం అలాగే కుసుమను శనగ లేదా ధనియూలతో 1:2 నిష్పత్తిలొ అ౦తర ప౦టగా సాగుచేస్తే అధిక నికరాదాయాన్ని పొందవచ్చు.