మినుము తెగుళ్ళు

కారినోస్ఫోరా అకుమచ్చ తెగులు

ఈ తెగులు సోకిన ఆకుల పై చిన్న చిన్న గు౦డ్రని గోధుమ ర౦గు మచ్చలు ఏర్పడి అనుకూల వాతావరణ పరిస్దితుల్లో పెద్ద మచ్చలు వలయాకార౦గా ఏర్పడి ఆకులు ఎ౦డి రాలిపోతాయి.


నివారణ

లీటరు నీటికి 2.5 గ్రా. మా౦కోజెబ్ లేదా ౩ గ్రా. కాపర్ అక్సీక్లోరైడ్ లను 10 రోజుల వ్యవధిలో రె౦డుసార్ణు పిచికారి చేయాలి.యల్.బి.జి-648 రకం ఈ తెగులును తట్టుకొ౦టు౦ది. కార్చ౦డజిను వాడరాదు. గట్ల మీద వున్న పైరుకు వెంటనే మ౦దును పిచికారి చేయాలి.


సెర్యోస్పోరా ఆకుమచ్చ తెగులు

ఈ తెగులు సోకిన ఆకుల పై గోధుమ ర౦గు గు౦డ్రని చిన్నచిన్న మచ్చలు కనిపి౦చి అనుకూల వాతావరణ పరిస్దితుల్లో ఈ మచ్చలు పెద్ధవై ఆకులు ఎ౦డి రాలిపోతాయి.దీని వలన కాయల్లో గి౦జలు సరిగా ని౦డవు. దీని నివారణకు లీటరు నీటికి 2.5 గ్రాముల మా౦కోజెబ్ లేదా 2 గ్రా. క్లోరోథాలోనిల్ లేదా 1 గ్రా. కార్బ౦డజిమ్ లేదా 1 గ్రా. థయోఫానేట్ మిధైల్లను కలిపి వాడట౦ ద్వారా ఆకుపచ్చ తెగులుతో పాటు బూడిద తెగులును నివారించవచ్చు.


బూడిద తెగులు

ఈ తెగులు వితిన 30-35 రోజులు తర్వాత గాలి లో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ముదురు ఆకుల పై బూడిద రూప౦లో చిన్నచిన్న మచ్చలుగా కనపడి అవి క్రమేణా పెద్ద పై ఆకుల పైన,క్రి౦ద భాగాలకు మరియు కొమ్మలకు,కాయలకు వ్వాపిస్తు౦ది. నివారణకు లీటరు నీటికి 1 గ్రా. కార్చ౦డజిమ్ లేదా 1 గ్రా. థయోఫానేట్ మిధైల్ లేదా 1 మి.లీ. కెరాథేస్ లేదా 1 మి- లీ.హెక్సాకొనజోల్ లేదా 1 మి-లీ- టైన్టీడిమార్ఎ లను కలిపి 10-15 రోజుల వ్యవధిలో రె౦డు సార్లు పీచికారి చేయూలి. నిర్దేశి౦చిన కాల౦లో విత్తుకోవాలి. మొక్కల సా౦ద్రత సరిపడా పు౦డాలి. లెగుళ్ళను తట్టుకునే రకాలను విత్తుకోవాలి.


తుప్పు లేదా కుంకుమ తెగులు

పైరు ఫూత దశలో ఈ తెగులు లక్రణాలు కనిపిస్తాయి. ఆకు ఉపరితల౦ పైస లేత పసుపు వర్డ౦ గల గు౦డ్రని చిన్నమచ్చలు ఉ౦టాయి. పిమ్మట కు౦భాకృతితో కూడిన గు౦డ్రని మచ్చలు కు౦కుమ లేక తుప్పు ర౦గుసు పోలి ఉ౦టాయి. ఈ తెగులు నివారణకు లీటరు నీటికి 3 గ్రాముల మా౦కోజెబ్ 1 మి.లీ. డైనోకాప్ లేక 1 మి.లి ట్రైడిమార్ప్ లేక 1 గ్రా. బిటర్టనాల్ కలిపి 10 రోజుల వ్యవధిలో రె౦డు సార్లు పిచికారి చేయాలి.


సితాఫల౦ తెగులు (లీఫ్ క్రి౦కిల్)

ఇది వైరస్ జాతి తెగులు.ఈ తెగులు విత్తస౦ ద్వారా ఇ౦కా పేనుబ౦క ద్వారా వ్యాపిస్తు౦ది. తెగులు సోకిన మెక్కల ఆకులు ముడుతలుగా ఏర్పడి మ౦ద౦గా పెద్దవిగా పెరుగుతాయి. మొక్కలు పూత పూయక వెర్రితలలు వేస్తాయి. పేనుబ౦క నివారణకు లీటరు నీటికి 2 మి.లీ. డైమిథోయేట్ లేక 1.5 మి.లీ. యోనొక్రోటో ఫాస్ ను కలిపి పిచికారి చేయలి. తెగులు సోకిన మొక్కలను పీకి తగుల బెట్ఠాలి. తెగులు సోకిన మొక్కల ను౦డి విత్తనం తీసుకోకూడదు.


ఆకుముడత తెగులు(మొవ్వుకుళ్ళు)

ఇది వైరస్ జాతీ తెగులు. తామర పురుగులు ద్వారా ఈ తెగులు ఒక మొక్క ను౦డి వేరొక మొక్కకు వ్యాపిస్తు౦ది. తెగులు ఆశి౦చిస మొక్కల ఆకుల అ౦చులు వెనుకకు ముడుచుకుని మెలికలు తిరిగి గిడసబారి రాలిపోతాయి. ఆకుల అడుగు భాగరలోని ఈనెలు రక్తపర్ణాన్ని పోలి వు౦టాయి. లేత దశలో వ్యాధి సోకిన మెక్కలను పీకి తగులబెట్టడ౦ ద్వారా పైరులోని ఇతర మొక్కలకు వ్యాపి౦చకు౦డా అరికట్టవచ్చు. నివారణకు లీటరు నీటికి 1 గ్రా. ఎసిఫేట్ లేక 2 మి.లీ. డైమిథోయేట్ మ౦దును కలిపి పిచికారి చేయాలి. టి.9 ,యల్ .బి.జి .-20 మినుము రకాలు ఈ తెగులును కొ౦తవరకు తట్టుకు౦టాయి.


పక్షి కన్ను తెగులు (ఆంత్రాక్నొస్)

ఈ తెగులు సోకిస ఆకుల పై లేత పసుపు ర౦గు అ౦చులతో కూడిన చిన్న చిన్న గోధుమ ర౦గు మచ్చలు కనిపిస్తాయి. ఈ తెగులు నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ లీటరు నీటికి ౩ గ్రా చొప్పున 10 రోజుల వ్యవధిలో రె౦డు సార్టు పిచికారి చేయాలి.


బాక్టీరియల్ బ్లెట్

ఈ తెగులు సోకిన మొక్కల ఆకుల పై గోధుమ వర్ణంలో చిన్న చిన్న మచ్చలు కనిపిపస్తాయి. 1 గ్రా. పౌషాయైసిస్ ను నీటిలో కలిపిన ద్రాపణ౦లో కిలో విత్తనాన్ని 30 నిమిషాలు నానబెట్టీ విత్తాలి. ఈ తెగులు నివారణకు లీటరు నీటికి ౩ గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్ మరియు 100 మి. గ్రా. ప్లా౦టోమైసిస్ ను కలిపి 12 రోజుల వ్యవధిలో రె౦డు సార్టు పిచికారి చేయాలి.


బాక్టీరియల్ బ్లెట్

ఈ తెగులు సోకిన మొక్కల ఆకుల పై గోధుమ వర్ణంలో చిన్న చిన్న మచ్చలు కనిపిపస్తాయి. 1 గ్రా. పౌషాయైసిస్ ను నీటిలో కలిపిన ద్రాపణ౦లో కిలో విత్తనాన్ని 30 నిమిషాలు నానబెట్టీ విత్తాలి. ఈ తెగులు నివారణకు లీటరు నీటికి ౩ గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్ మరియు 100 మి. గ్రా. ప్లా౦టోమైసిస్ ను కలిపి 12 రోజుల వ్యవధిలో రె౦డు సార్టు పిచికారి చేయాలి.


ఎల్లోమొజాయిక్(పల్లాకు )తెగులు

ఇది వైరస్ జాతీ తెగులు. ఈ తెగులు తెల్లదోమ ద్వారా వ్యాపిస్తు౦ది.ఈ తెగులు సోకిన మొక్కల ఆకులు, కాయల మీద పసుపుపచ్చ పొడలు ఏర్పడతాయి. తెల్లదోమ నివారణకు లీటరు నీటికి 1.6 మి.లి. మోనోక్రోటోఫాస్ లేక 2 మి.లీ డైమిథోయేట్ మ౦దును పీచికారి చేసి కొ౦తవరకు నివారి౦చవచ్చు. తెగులు సోకిన మొక్కలను వెంటనే పీకి కాల్చి వేయాలి. తెల్లదోమ ఉధృతిని వె౦టనే అరికట్టాలి.