మొక్క జొన్న రకాలు:

ఎరువులు (ఎకరాకు): ఖరీఫ్ రబీ
1.నత్రజని 40కిలో 48కిలోలు
2.భాస్వరం 20కిలోలు 24కిలోలు
3.పోటాష్ 16కిలోలు 20కిలోలు


నత్రజనిని విత్తేటప్పుడు 1/4వంతు ,విత్తిన నెల రోజులకు 1/2వంతు ,50-55రోజులకు మిగిలిన 1/4 వంతు వేయాలి.వర్షాధారపు పంటకు 2/3వంతు నత్రజని ని విత్తే సమయంలోను మిగిలిన నత్రజనిని విత్తిన 30-40రోజులకు వేయాలి.మొత్తం భాస్విరం మరియు పోటాష్ ఎరువుల్ని విత్తే సమయంలో వేయాలి.

జింకు లోపం:
మొక్కలలో జింకు లోపం(ఆకులు పసుపుపచ్చ రంగులోకి మారడం లేదా లేతపైరు తెల్ల మొగ్గగా)కనిపిస్తే లీటరు నీటికి 2గ్రాముల జింకు సల్ఫేటును కలిపి పైరుపై పిచికారి చేయాలి.పై పాటు ఎరువులు వేసేటప్పుడు భూమిలో తగినంత తేమ ఉండాలి.ఎరువులు వేసిన తర్వాత సాళ్ళలో మట్టి ఎగదోయాలి.