agriculture ap

కాండం తొలిచే చారల పురుగు:

ఎక్కువగా ఖరీఫ్ లో ఆశిస్తుంది.మొక్కజొన్న మొలకెత్తిన 10-20రోజుల పైరును ఆశించి ఆకుల అడుగుభాగంలో గుడ్లను సముదాయంగా పెడుతుంది.గుడ్లు 4-5రోజులకు పగిలి పిల్ల పురుగులు మొక్క జొన్న అంకురంలోనికి చేరుకుంటాయి.అవి ఎదిగే అంకురాన్ని తింటే మొవ్వు చనిపోయి పంటకు ఎక్కువ నష్టం వాటిల్లుతుంది.లేదా ఎదిగే ఆకులకు రంధ్రాలు ఏర్పరచి తి౦టాయి.అందువల్ల ఆకుపై గుండ్రని రంధ్రాలు వరుసలలో కనిపిస్తాయి.ఈ పురుగు ఆకులని,కాండాన్ని,పూతని,క౦కిని ఆశించి నష్టం కలుగజేస్తుంది

agriculture ap

గులాబి రంగు పురుగు

ఎక్కువగా రబీ లో ఆశిస్తుంది.దీని లార్వాలు ఆకుల మీద పత్రహరితాన్ని గోగి తినడం వలన ఆకులు పలుచగా తయరవుతాయి. కాండంలో గుండ్రని లేక 'యస్' ఆకారంలో ఉండే' సారంగాలను గమనించవచ్చు.మొవ్వు చనిపోతుంది.డి.హెచ్.యం.101,103రకాలు ఈ పురుగును తట్టుకొంటాయి.పురుగుల నివారణకు పురుగు ఆశించిన మొక్కలను పీకి వేసి నాశనం చేయడం,మొక్క జొన్న అంతర పంటగా అపరాలను పెంచడం,ఎండోసల్ఫాన్ 2.0మి.లీ నీటికి కలిపి 10-20రోజుల పైరు మీద పిచికారి చేసి అవసరమైతే మరల 15రోజుల వ్యవధి తర్వాత పిచికారి చేయాలి.ఉధృతి మరీ ఎక్కువగా ఉంటే రెండోసారి ఎండోసల్ఫాన్ పిచికారి చేసే బదులు కార్బోఫ్యురాన్ 3శాతం లేదాఎండోసల్ఫాన్ పిచికారి చేసే బదులు కార్బోఫ్యురాన్ 3శాతం లేదా ఎండోసల్ఫాన్ 4శాతం గుళికలను ఎకరాకు 3కిలోల చొప్పున ఆకు సుడులలో వేసి ఈ పురుగులను నివారించవచ్చు.

agriculture ap

రసం పీల్చే పురుగులు

30రోజుల పైబడిన మొక్కజొన్న పంటను నల్లి,పేనుబంక ఆశిస్తాయి.వీటి తల్లి పిల్ల పురుగులు మొక్కజొన్న ఎదిగే భాగాల నుంచి,ఆకులనుంచి రసాన్ని పీల్చడం వలన ఆకులు లేత పసుపురంగుకు మారి,మొక్కలు గిలసబారిపోతాయి.ముఖ్యంగా ఈ పురుగులు తేనెలాంటి జిగురును విడుదల చేసి శిలీంధ్రాలు ఉత్పత్తి అయ్యేందుకు దోహదపడతాయి.తద్వారా తెగుళ్ళు సోకుతాయి.సాధారణంగా ఈ పురుగులను సహజ శత్రువులైన పరాన్న జీవులు,పరాన్న భుక్కులు ఈశించి అదుపులో ఉంచుతాయి.అందువల్ల అవసరాన్ని బట్టి మోనోక్రోటోఫాస్ 1.6మి.లీ లేదా డైమిదోయేట్ 2మి.లీ లేదా ఎసిఫేట్ 1గ్రా. లాటరు నీటికి కలిపి పిచికారి చేసి నివారించుకోవచ్చు.