agriculture ap

*ఆకుమాడు తెగులు(కమ్మరోగం)(టర్సికమ్ లీఫ్ బైట్):

ఆకులపై పొడవైన కోలగా ఉండే బూడిద రంగుతో కూడిన ఆకు పచ్చ లేక గోధుమ రంగు మచ్చలు కన్పిస్తాయి.ఈ మచ్చలు క్రింద ఆకులపై కనిపించి ,తర్వాత పై ఆకులకు వ్యాపిస్తాయి.అధిక తేమతో కూడిన వాతావరణంలో ఆకు ఎండి మొక్కలు చనిపోయినట్లుగా కనిపిస్తాయి.దీని నివారణకు లీటరు నీటికి 2.5గ్రా మా౦కోజెబ్ కలిపి పిచికారి చేయాలి.డి.హెచ్.యం.1 రకాన్ని విత్తుకోవాలి.

వడలు తెగులు(సెఫాలోస్పోరియం అక్రిమోనియమ్)(బ్లాక్ బండిల్) ఆకులు మరియు కాండం ఊదారంగుకు మారి,తర్వాత కాండం మొదటి 1,2కణువులపై గోధుమ రంగు చారలు ఏర్పడి లోపలి నాళాల నల్లగా మారి ఎండిపోతుంది.

agriculture ap

వదల తెగులు(లేట్విల్ట్)(సెఫాలోస్పోరియం మేడిస్)

ఈ తెగులు ఎక్కువగా గింజలు పాలుపోసుకునే దశలో ఆశిస్తుంది.మొక్కలు పై నుండి క్రిందకి వదలి ఆకులు లేత ఆకుపచ్చ రంగుకు మారి తర్వాత ఎండిపోతాయి.పై రెండు వడల తెగుళ్ళు నివారణకు పంట మార్పిడి,పుష్పించే దశ నుండి నీటి ఎద్దడి లేకుండా చూడటం,తెగుళ్ళను తట్టుకునే డి.హెచ్.యం.103,105,త్రిశూలత రకాలను సాగు చేయాలి.

agriculture ap

మసికుళ్ళు

ఆకులు మరియు కాండం మొదట ఆకుపచ్చగా తర్వాత గోధుమ రంగుగా మారి క్రమేపి ఎండిపోతాయి.కాండం లోపలి బెరడు కుళ్లిపోయి ,నాళాల పై బొగ్గు పొడిలాంటి శిలీంద్ర బీజాలు(స్క్లిరోషియా)నల్లగా ఏర్పడి కండెరాలిపోయి,కాండం బలహీన పడి విరిగిపోతుంది.ఈ దశలో స్క్లిరోషియా మొదటి 1,2కణువుల పై చూడవచ్చు. దీని నివారణకు మొక్క పుష్పించే దశ నుండి నీటి ఎద్దడి లేకుండా చూడాలి.తెగులును తట్టుకునే రకాలయిన డి.హెచ్.యం.103,105,త్రిశూలతలను సాగు చేయాలి.

agriculture ap

పొడతెగులు/మత్త తెగులు(బి.యల్.యస్.బి.)(బ్యా౦డెడ్ లీఫ్ అండ్ షీత్ బ్లైట్)

ఆకు తొడిమలపై రంగు కోల్పోయిన పెద్ద,పెద్ద చారలు ఏర్పడతాయి.ఈ చారల మధ్య ముదురు వర్ణపు చారలు ఏర్పడతాయి.తెగులు తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఆకు తొడిమ మరియు ఆకు మొత్తం మాడిపోతాయి.దీని నివారణకు శుభ్రమైన ప౦టసాగు,పంట అవశేషాలను నాశనం చేయటం,నేలకు అనే ఆకులను తీసివేయడం మరియు 1గ్రా.కార్బ౦డజిమ్ లేక 1మి.లీ ప్రోపికొనజోల్ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.తెగులును కలుగ చేసే శిలీంధ్రం కలుపు మొక్కలను కూడా ఆశిస్తుంది. కనుక కలుపు మొక్కలు లేకుండా చూడాలి.