అంతర పంటలు :

పెసర అంతర పంటగా ప్రత్తి , కందిలో వేసుకోవచ్చు . పెసర : ప్రత్తి /రబీ కంది 3:1 పెసర : తొలకరి కంది - 7:1 , అంతర పంటకు అనువైన పెసర రకాలు యల్.జి.జి. 460,450,410 , యం.జి.జి.-295, డబ్ల్యు.జి.జి.-2, 37, యం .యల్ -267 పెసరను ప్రత్తి లేదా రబీ కందితో అంతరాపంటగా వేసినపుడు ఎకరాకు 5 కిలోల విత్తనం , 6 కిలోల నత్రజనిని , 15 కిలోల భాస్వరం వేయాలి . తొలకరి కందితో వేసినపుడు ఎకరాకు 6 కిలోల విత్తనం , 7 కిలోల నత్రజనిని , 17.5 కిలోల భాస్వరం వేయాలి.