రసం పీల్చు పురుగులు

పచ్చ దీపపు పురుగులు

ఆశించిన ఆకుల చివర్లు పసుపు పచ్చగా మారి,క్రమేపి ఆకు అంతా ఎర్ర బడి,చివరిగా ఆకులు ముడుచుకొని దోనేలలాగా కనిపిస్తాయి.వీటి నివారణకు మొనోక్రోటో ఫాస్ 1.6మి.లీ లేదా డైమిథొయేట్ 2.0 మి.లీలేదా మిధైల్ డేమెటాన్ 2మి.లీ లీటరు నీటికి కలిపి ఆకుల అడుగుభాగం బాగా తడిసేలా పిచికారి చేయాలి.

తెల్ల దోమ

ఆకుల అడుగు భాగం నుండి రసాన్ని పీల్చడం వలన ఆకులు పసుపు రంగుకు మారి మొక్కలు కూడా గిడసబారి ఎండిపోతాయి. వీటి నివారణకు ట్రైజోఫాస్ 2.5మి.లీ లేదా ఎసిఫేట్ 1గ్రా. లేదా మొనోక్రోటోఫాస్ 1.6మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

తామర పురుగులు

ఈ పంటను మొదటి దశ నుంచి ఆశిస్తాయి. పైరు బెట్టకు గురైనప్పుడు వీటి ఉధృతి ఎక్కువగా ఉంటుంది.ఇవి చాల చిన్న గా ఉండి పసుపు పచ్చ లేక గోధుమ రంగు లో ,చీలిన రెక్కలతో ఉంటాయి.పిల్ల,పెద్ద పురుగులు ఆకులను,పువ్వులను గోకి రసాన్ని పీలుస్తాయి.ముఖ్యంగా ఈ పురుగులు లేత భాగాల్ని ఆశ్రయించి పెరగటం వలన ఆకుల పెళుసుగా మారి మొక్క గిడసబారి పోతుంది.ఇవి ఆశించిన ఆకుల పై పొడ లాంటి మచ్చలు ఏర్పడి ఆకుల పాలిపోయిముడుచుకొని పోతాయి.పరోక్షంగా ఇది నేక్రొసిస్ వైరస్ తెగులును వ్యాప్తి చేసి తీరని నష్టాన్ని కలుగజేస్తుంది. వీటిని అదుపు చేసే నిమిత్తం మందులు పిచికారి చేయడం కంటె కిలో విత్తనానికి 5గ్రా.ఇమిడాక్లో ప్రిడ్ తో విత్తన శుద్ధి చేస్తే మంచిది.

ఆకుల్ని తినే పురుగులు

పొగాకు లద్దె పురుగు

క్రిములు గుంపులుగా ఆకులపై పత్ర హరితాన్ని గీకి తింటాయి.దీని వలన ఆకులు జల్లెడాకులుగా మారుతాయి.వీటి నివారణకు విషపు ఎరను(10 కిలోల తవుడు,కిలో బెల్లం మరియు ఒక లీటరు మొనోక్రోటోపాస్ లేదా 1 కిలోల కార్బరిల్ 50శాతం పొడి మందును తగు నీటితో కలిపి ఉండలుగా తయారుచేసుకొని మొక్కల మొదళ్ళ దగ్గర సాయంత్రం సమయంలో వేసుకోవాలి.

పచ్చ రబ్బరు

ఈ పురుగులు పంట తొలిదశ లో ఎక్కువగా ఆశించి ఆకులను తిని రంధ్రాలు చేస్తాయి.వీటి నివారణకు థయోడికార్బ్ 1.5గ్రా లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

బీహారి గొంగళి పురుగు

రెక్కల పురుగు శరీరం గోధుమ,ఎరువు రంగులో ఉండి నల్లటి మచ్చలను కల్గి గులాబి రంగులో ఉండి నల్లటి మచ్చలు ఉంటాయి.తల్లి పురుగు ఆకులపై గ్రుడ్లను గుంపులుగా పెడుతుంది.లార్వాల శరీరం లేత పసుపు రంగులో ఉండి ముదురు పసుపు రంగు వెంట్రుకలతో కప్పబడి వుంటుంది.ఈ లార్వాలు ఆకులను తిని తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి.పురుగు ఉధృతంగా ఆశస్తే మొక్కలు మోడుబారి పోతాయి. గ్రుడ్లను తొలిదశ గొంగళి పురుగులు గుంపులుగా ఆకుల మీద ఉన్నప్పుడు ఏరి నాశనం చేయాలి.తొలి దశ గొంగళి పురుగులను నివారించేందుకు వేప గింజల ద్రావణాన్ని(5 శాతం) పిచికారి చేయాలి.పెద్ద లార్వాలు ఉన్నప్పుడు దళ ఎండోసల్ఫాన్ లేదా క్లోరిపైరిఫాస్ 2.0మి.లీ లేదా డైక్లోర్వాస్ 1.0మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

తలను ఆశించే పురుగు(శనగ పచ్చ పురుగు)

ప్రొద్దు తిరుగుడు పండించే అన్ని ప్రాంతంలో ఈ పురుగు ఆశిస్తుంది.దీని రెక్కల పురుగుల ముందు రెక్కల మసక గోధుమ రంగులో ఉంటాయి.లేత ఆకుల మీద,విచ్చుకునే పూవుల మీద గ్రుడ్ల పెడుతాయి.గ్రుడ్ల నుండి వెలువడిన పిల్ల పురుగులు లేక ఆకుపచ్చ రంగులో ,పెరిగిన క్రిములు ముదురు ఆకుపచ్చ రంగు నుండి,గోధుమ రంగు ,ఊదారంగు,లేదా నల్ల రంగులో ఉంటాయి.కోశస్థ దశ భూమి గడుపుతుంది.ఎకరాకు 4-5 లింగాకర్షకు బుట్టలు అమర్చి పురుగు ఉనికిని గమనించాలి.దీని క్రిములు పువ్వుల ,గింజల మధ్య చేరి గింజలను తింటూ అధిక నష్టాన్ని కలుగ చేస్తాయి. ఉధృతిని ఎక్కువగా ఉన్న ఎడల ఎండోసల్ఫాన్ లేదా క్వినాల్ఫాస్ లేదా క్లోరిపై 2.0మి.లీ లేదా మొనోక్రోటోఫాస్ 1.6మి.లీ లేదా సైపర్ మెత్రిన్ లేదా డెల్టామెత్రిన్ లేదా ఫెన్వల్ రేట్ 1.0 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.హెచ్.యస్.పి.వి అనే వైరస్ ను ఎకరాకు 200 ఎల్.ఇ పిచికారి చేసి కూడా ఈ పురుగును నివారించవచ్చు.