ప్రొద్దుతిరుగుడు ఉత్పత్తులు

పువ్వు రుద్దుట

ఈ పంట ,పరపరాగ సంపర్కం ద్వారా గింజ కట్టుకొంతుంది.ఇందుకు ముఖ్యంగా దోహదం చేసేవి తేనె తీగలు.వీటి సంఖ్యా తగినంతగా లేనప్పుడు ఉదయం 8నుండి 11గంటల మధ్య సున్నితమైన గుడ్డతో పువ్వుల మీద వలయాకారంగా రుద్దాలి.ఈ పని కనీసం 15 రోజుల పాటు చేయాలి. రోజు మార్చి రోజు కూడా ఈ పని చేయ వచ్చు.తేనేటీగలను ఎక్కువగా ఆకర్షించేందుకు ప్రొద్దుతిరుగుడు పంట చుట్టు 2లేదా 4 వరుసల ఆవాలు వేయాలి.

పక్షుల బెడద

ముఖ్యంగా రామ చిలుకల బెడద ఎక్కువ.వీటి నివారణకు పైరు ను పెద్ద కమతాలలో వేయాలి.మెరుపు రిబ్బనులను పైరు పైన అడుగు ఎత్తున సూర్య రశ్మి రిబ్బను పై పడేటట్లు ఉత్తర దక్షణ దిశగా కట్టాలి.శబ్దం చేయడం ద్వారా చేయడం ద్వారా గాని ,దిష్టి బొమ్మలను ఉపయోగించి గాని పక్షులను పార ద్రోలాలి.