1.కళ్యాణి :

పంటకాలం 105-110 రోజులు. దిగుబడి ఎకరాకు 8-10 క్వింటాళ్ళు.మొక్క కాండం, కణుపులు , ఆకులు , పుత ఊధారంగులో ఉంటాయి. గింజలు ఎరువుతో కూడిన గోధుమ రంగు కలిగి ఉంటాయి. గింజ లావు మద్యస్థంగా ఉంటుంది . మాంసకృతులు 6 శాతం , లైసిన్ 3.3 శాతం.

2.గోదావరి

పంటకాలం 120-125 రోజులు. దిగుబడి ఎకరాకు 12-16 క్వింటాళ్ళు.అన్ని ఋతువుల్లో పండించవచ్చు,పైరు ఎక్కువగా పిలకలు వేస్తుంది.మొక్క పచ్చగా ఉండి , వెన్నులు పెద్దగా ముద్దుగా ఉంటాయి.గింజలు ఎరువు గోధుమ రంగు కలిగి, మధ్యస్థ మైన లావుఉంటాయి . గింజలలో మాంసకృతులు 6.58 %

3.సూరజ్ :

పంటకాలం 85 - 90 రోజులు. దిగుబడి ఎకరాకు 8-12 క్వింటాళ్ళు. విజయనగరం ,విశాఖపట్నం , శ్రీకాకుళం జిల్లాలకు అనువైనది.

4.రత్నగిరి :

పంటకాలం 110 - 115 రోజులు. దిగుబడి ఎకరాకు 12 - 16 క్వింటాళ్ళు.పైరు ఎక్కువగా పిలకలు వేస్తుంది.మొక్క ఆకుపచ్చగా ఉండి 9 సెం.మీ . ఎత్తువరకు ఎదుగుతుంది. వెన్నుల పెద్దగా ముద్దుగా ఉంటాయి . గింజలు ఎరుపు గోధుమరంగులో ఉండి, మధ్యస్థమైన లావుగా వుంటాయి.

5.పద్మావతి :

పంటకాలం 105 - 110 రోజులు. దిగుబడి ఎకరాకు 12 - 16 క్వింటాళ్ళు.పైరు ఎక్కువగా పిలకలు వేస్తుంది.చిత్తూరు జిల్లాకు అనుకూలం .

6.సప్తగిరి :

పంటకాలం 110 - 115 రోజులు. దిగుబడి ఎకరాకు 12 - 16 క్వింటాళ్ళు.పైరు ఎత్తుగా పెరిగి ఎక్కువగా పిలకలు వేస్తుంది. చిత్తూరు జిల్లాకు అనుకూలం .

7.మారుతి :

పంటకాలం 110 - 115 రోజులు. దిగుబడి ఎకరాకు 12 - 16 క్వింటాళ్ళు. బెట్టను, అగ్గి తెగులును అన్ని దసల్లోను తట్టుకుంటుంది.

8.చంపావతి :

పంటకాలం 80-85 రోజులు. దిగుబడి ఎకరాకు 10-12 క్వింటాళ్ళు. రాగి పండించే అన్ని ప్రాంతాలకు అనువైనది . వెన్ను ధృడంగా 8 కంటే ఎక్కువ వీళ్ళతో ఉంటుంది . బెట్టను తట్టుకుంటుంది . అంతర పంటగా కందితో పండించేందుకు అనువైనది.

9.భారతి :

పంటకాలం 105 - 110 రోజులు. దిగుబడి ఎకరాకు 14 - 16 క్వింటాళ్ళు. అన్ని ఋతువుల్లో పండించవచ్చు, వెన్నులు పెద్దగా ముద్దుగా ఉంటాయి . అగ్గి తెగులును కొంత వరకు తట్టుకోగలదు.ఎండు గడ్డి దిగుబడి కూడా ఎక్కువగా వస్తుంది.