తామర పురుగు:

తామర పురుగులు బెట్టగా ఉన్న పరిస్థితుల్లో అధికంగా ఆశిస్తాయి.తామర పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీలుస్తాయి,ఆకులు ముడుచుకుపోయి పెలుసు బారిపోతాయి.ఈ పురుగుల వల్ల మొవ్వ కుళ్ళు వ్యాప్తి చెందుతుంది.దీని నివారణకు మోనోక్రోటోఫాస్ 1.5మి.లీ లేక అసిఫేట్ 1గ్రాము లేదా పెర్ఫోనిల్ 2మి.లీ పిచికారి చేయాలి.

పొగాకు లద్దె పురుగు:

ఈ పురుగులు ఆకులను జల్లెడగా మార్చి నష్టాన్ని కలుగ జేస్తాయి.వీటి నివారణకు అసిఫేట్ 1గ్రాము లేదా క్వినాల్ఫాస్ 2మి.లీ లేదా క్లోరిపైరోఫాస్ 2.5 మి.లీ ల మందును పిచికారి చేయాలి.ఈ పురుగు తీవ్రత అధికంగా ఉంటే విషపు ఎరాలను పెట్టాలి.

ఆకుముడత పురుగు:

బెట్టగా ఉన్న పరిస్థితుల్లో ఈ పురుగు ఎక్కువగా ఆశిస్తుంది.ఆకు అంచులను కలిపి పత్ర హరితాన్నిగోకి నష్టాన్ని కలుగ జేస్తుంది.దీని నివారణకు ఎసిఫేట్ 1గ్రాము లేదా క్వినాల్ ఫాస్ 2మి.లీ లేదా క్లోరోపైరోఫాస్ 2.5మి.లీ ల మ౦దును పిచికారి చేయాలి.