ఇతర విషయాలు

పంటకోత -నిల్వ: 70-80శాతం మొక్కలు,ఆకులు,కొమ్మలు,పసుపు మారి,కాయడొల్ల లోపలి భాగం నలుపుగా మారినప్పుడుకోయాలి.కోత సమయంలో నేలలో తగినంత తేమ వుండాలి.విత్తనం కొరకు కావాల్సిన కాయలను నేరుగా ఎండలో ఎండబెట్టకుండా నీడలో ఆరబెట్టాలి.కాయల్లో తేమ శాతం 9కి లోపు వుండేడట్లు ఆరబెట్టి గోనె లేక పాలిధిన్ సంచుల్లో నిల్వ చేయ్యాలి నిల్వలో కాయతోలుచు పురుగు మరియు ఇతర కీటకాలు నుండి రక్షణకు 2-3 వారాలకొకసారి మలాధియాన్ ద్రావణాన్ని 10మి.లీ పది లీటర్ల నీటికి కలిపి పిచికారి చేయాలి.

పరికరాలపై రాయితీ ధర రాయితీ రైతుధర
వేరుశనగ కాయలు తెంపు యంత్రం 15080 14560 14560
వేరుశనగ కాయలు మోటారుతో నూర్చు యంత్రం 79040 30000 49040
వేరుశనగ పిక్కలను గంటకు 60కేజీలు వలిచేసే యంత్రం 79040 30000 49040